Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం నుంచి సమంత స్టార్డమ్ ను అనుభవిస్తుంది. హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి పోటీ చేస్తున్న కూడా తన ఫామ్ ను కోల్పోకుండా దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న హీరోలందరితో సమంత సినిమాలు చేసింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఆల్మోస్ట్ నేటి జనరేషన్ కు చెందిన అగ్ర హీరోలందరితో సమంత ఆడి పాడింది. ఒక్క ప్రభాస్ తో మాత్రం ఆమె యాక్ట్ చేయలేదు.
ప్రభాస్ సైతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్లుగా ఉన్న అనుష్క శెట్టి, నయనతార, త్రిష, తమన్నా వంటి ప్రముఖ నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రభాస్, సమంత కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ తరుణం మాత్రం రానేలేదు. గతంలో సమంతతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కు ఎదురయింది. అందుకు ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు.
సమంతతో కలిసి నటించకపోవడానికి ప్రత్యేకంగా ఎటువంటి కారణం లేదని.. తనకు, నాకు మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం వల్లే తమ కాంబినేషన్ లో సినిమా సెట్ కాలేదని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ ఎత్తు 1.83 మీటర్లు కాగా.. సమంత ఎత్తు 1.58 మీటర్లు, హైట్ పరంగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే.. సమంత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. అందుకే సమంతతో నటించేందుకు ప్రభాస్ మక్కువ చూపలేదు. గతంలో సాహో సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ సుజీత్ ప్రయత్నించాడు. అయితే ప్రభాస్ అందుకు ఒప్పుకోలేదు.
తన పక్కన సమంత సెట్ కాదని వివరించడంతో.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను హీరోయిన్గా ఎంపిక చేశారు. అలా హైట్ వల్ల ప్రభాస్ తో నటించే అవకాశాన్ని సమంత మిస్ చేసుకుంది కాగా, సమంత ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. 2022లో యశోద మూవీలో డీసెంట్ హిట్ అందుకున్న ఆమె అదే ఏడాది శాకుంతలంతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023లో ఖుషి మూవీతో హిట్ కొట్టాలని ఎంతగానో ఆశపడింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు జోడిగా సమంత నటించింది. అయితే ఈ సినిమా కూడా పరాజయం పాలైంది. ఇక హెల్త్ ఇష్యూస్ కారణంగా గత కొద్ది నెలల నుంచి కెమెరాకు దూరంగా ఉంటున్న సమంత.. త్వరలోనే మళ్లీ షూటింగ్స్ లో బిజీ కాబోతోంది. నేడు తన 37వ బర్త్డే సందర్భంగా బంగారం టైటిల్ తో ఓ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. బంగారం సినిమాలో తన ఫస్ట్ లుక్ ను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!