Body: కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్థపడుతున్న,మీరు కుర్చుని లేవలేక ఇబ్బంది పడుతున్న,మీరు నీళ్లు తక్కువ గా తాగుతున్నట్టు అర్ధం. కారణం 80 శాతం నీటితో కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ నిర్మితమై ఉంటుంది. నీరు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పులు వస్తుంటాయి.
యూరిన్ రంగు కూడా మీ శరీరం డీహైడ్రేట్ అయింది అని తెలిపే ముఖ్య లక్షణం లో ఒక్కటి. అలాగే మీరు తరచుగా యూరిన్ కి వెళ్లకపోయినా కూడా సరైన స్థాయిలో నీళ్లు తాగడం లేదని తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కరు రోజుకు నాలుగు నుండి ఏడు సార్లు తప్పకుండా యూరిన్ కి వెళ్లాలి. అలాగే యూరిన్ కలర్ పసుపు రంగులో ఉంది అంటే,సరిపడినన్ని నీళ్లు తాగడం లేదని అర్ధం.మన జీర్ణవ్యవస్థకు కూడా నీటి అవసరం చాలా ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా, ఫ్లూయిడ్స్ తక్కువగా ఉండడం వల్ల మలబద్దక సమస్య వస్తుంది.
పెదాలు ఎండిపోవడం ,చర్మం నిర్జీవంగా ఉండడం కూడా శరీరంలో నీరు సరిపడినంత లేదని తెలియజేసే లక్షణం అని గుర్తించాలి. అలసట , ఉత్సాహం లేకపోవడం,బ్లడ్ ప్రెజర్ తగ్గడం అనేది శరీరంలో తక్కువ నీరు ఉండడానికి సంబంధించిన లక్షణం గా గుర్తు పెట్టుకోవాలి. దీనివల్ల ఆక్సిజన్ సరిగా అందదు ,వీటితో పాటు చెమట చాలా తక్కువగా పడుతుంటుంది.
ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీరు శరీరానికి కావలసిన నీళ్లు తాగడం లేదని తెలుసుకోవాలి.ఇవే మీరు శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగడం లేదని చెప్పే గుర్తులు. ఇప్పటి నుండి సరిపడా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇలాంటి సిగ్నెల్స్ కనపడకుండా జాగ్రత్త పడండి.