Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కూడా స్వీట్స్ తినవచ్చు..!! ఇలా తినాలి..!!

Share

Diabetes: వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం ఇది ఒక్కటి వాడితే చాలు దీని వెనకాల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గుల కారణంగా సమస్య వస్తుంది.. ఎక్కువమంది డయాబెటిస్ పేరు వింటే వణికిపోతున్నారు.. కానీ మనం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అయితే సాధ్యమైనంతవరకు తీపి పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలా అని నోరు కట్టేసుకోనవసరం లేదు.. తీపి పదార్థాలను తీసుకుంటూనే చక్కెరను అదుపులో పెట్టుకోవచ్చు.. కానీ షరతులు వర్తిస్తాయి..!! తీపి పదార్థాలు తినాలనిపిస్తే ఏ విధంగా మన డైట్ ను ప్లాన్ చేసుకోవాలో చూద్దాం..!!

Diabetes: take this type of sweets
Diabetes: take this type of sweets

Diabetes: మధుమేహం ఉన్నవారు స్వీట్లను ఈ రకంగా తీసుకోండి..!!
మధుమేహం ఉన్నవారు ఇంతకు ముందు తీసుకునే మోతాదు కంటే తక్కువ పరిమాణంలో స్వీట్లు తీసుకోవాలి పంచదారతో తయారు చేసిన వాటికంటే బెల్లంతో చేసిన వాటిని తీసుకుంటే చాలా మంచిది బెల్లం లో ఉండే ఐరన్ కంటెంట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఇంకా మీరు స్వీట్లు తిన్న అనుభూతిని కూడా కలిగిస్తుంది. ఒకవేళ పంచదారతో చేసిన స్వీట్స్ నే తినాలనిపిస్తే ఒకటి లేదా రెండు తినండి అంతకుమించి ఎక్కువ తింటే షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. మార్కెట్లో లభించి కేక్స్ కుకీస్ ఇలాంటివి ఎక్కువగా తినకూడదు వాటికి బదులు ఇంట్లోనే కేక్ తయారు చేసుకొని తింటే మంచిదే.. అందులో మైదా, పంచదార కు బదులు గోధుమ , బెల్లం ఉపయోగించి చేసుకుని తింటే మంచిది. బెల్లం లేదంటే తేనె ఉపయోగించి తయారు చేసుకున్న కేకులు తిన్నా కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. మార్కెట్లో సాస్, డిప్స్ అని చాలా రకాలు ఏవేవో దొరుకుతు ఉంటాయి.. వాటి జోలికి అస్సలు వెళ్ళకండి.. పాలు, పెరుగు లో చక్కెరను ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటారు. అయితే వీటిలో ఉపయోగించిన పంచదార త్వరగా కొవ్వు రూపం లోకి మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. పైగా అధిక బరువు పెరిగే అవకాశం లేకపోలేదు..

Diabetes: take this type of sweets
Diabetes: take this type of sweets

మనం ఏవైతే ఆహార పదార్థాలు తినకూడదు అంటామో అవే ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి తీపి పదార్థాలను తిని వద్దు అంటే అది ఎక్కువగా తినాలని అనిపిస్తుంది.. అటువంటి కోవకు వచ్చేవే ఐస్ క్రీమ్స్.. ఇందులో పాల పొడి, పంచదార ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.. ఇది శరీరానికి మేలు చేయకపోగా బాగా కొవ్వు రూపంగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.. ఒకవేళ ఐస్ క్రీమ్స్ తినాలి అనిపిస్తే మీరు శాతం ఎక్కువగా ఉన్న ఐస్ ఫ్రూట్స్ తీసుకోండి.. వాటిలో మీకు నచ్చిన ఫ్లేవర్ ను ఎంచుకొని ఐస్ ఫ్రూట్ ను లాగించేసేయండి.. చాక్లెట్లు కూడా ఎక్కువగా తినకూడదు ఒకవేళ చాక్లెట్ తినాలి అనిపిస్తే సాధారణ చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్ తింటే చాలా మంచిది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడును ఉత్తేజపరుస్తుంది.. సాధారణ బ్రెడ్ తింటే ఎక్కువ సేపు ఆకలి లేదు. దీని కంటే బ్రౌన్ బ్రెడ్ తింటే వీరి ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ లో కొంతమందికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. అటువంటి వారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా రైస్ లో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీనిని తినటం వలన వెంటనే ఆకలి వేస్తుంది. దీనికి బదులు బ్రౌన్ రైస్ లేదా సిరిధాన్యాలతో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది.. ఇవి కొంచెం తిన్న కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు . శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. చిరుతిళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు.. మీ డైట్ ఇలా సెట్ చేసుకొని చూడండి.. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..


Share

Related posts

డీజే న్యూఇయర్ ఈవెంట్ లో అనసూయ రచ్చ.. డ్యాన్స్ అదరగొట్టేసిందిగా?

Varun G

Daily Horoscope జూలై 16 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

జ‌గ‌న్ మాట‌ల‌తో బాబుకు బీపీ పెంచుతున్న వీర్రాజు

sridhar