సలాడ్ తయారీ చాలా సింపుల్.. పైగా ఇందులో బోలెడన్ని పోషక విలువలను కలిగి ఉంటుంది. వీటిని తరచూ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.m సాధారణంగా సలాడ్స్ అందరూ తింటారు.. చూడగానే తినాలనిపించే రంగురంగుల రెయిన్ బో సలాడ్ ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా.!? ఈ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. రంగురంగుల రెయిన్ బో సలాడ్ ను రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు..
ఎర్ర క్యాప్సికం ముక్కలు అరకప్పు, పసుపు క్యాప్సికం ముక్కలు అరకప్పు గ్రీన్ క్యాప్సికం ముక్కలు, అరకప్పు బ్రకోలి ముక్కలు పావుకప్పు, క్యారెట్ తురుము రెండు చెంచాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ రెండు చెంచాలు, నిమ్మరసం ఒక చెంచా, ఆలూరు నూనె కొద్దిగా, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి కొద్దిగా..
ముందుగా బ్రకోలీ క్యాప్సికం ముక్కలను వేడి నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ని ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి అన్నింటినీ కలిపి ఐదు నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో క్యాప్సికం, బ్రకోలీ, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు అన్నింటినీ వేసి.. ముందుగా ఫ్రిజ్లో పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ మిశ్రమాన్ని ఇందులో పోసి కలుపుకోవాలి. అంతే రంగురంగుల రెయిన్ బో సలాడ్ తినడానికి రెడీ.. ఈ సలాడ్ ను పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి . ఈ సలాడ్ లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ సలాడ్ బెస్ట్ ఆప్షన్..