NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 20 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu ఏప్రిల్ 20 – గురువారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం – Aries Horoscope in Telugu April 20
సోదరులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu April 20 2023

వృషభం: Taurus Horoscope in Telugu April 20
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను శృతిమించకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఊహించని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిధునం: Gemini Horoscope in Telugu April 20
కుటుంబ సభ్యులతో కష్ట pసుఖాలు విచారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించాలి.
కర్కాటకం: Cancer Horoscope in Telugu April 20
సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూల ఉంటుంది.
సింహం: Leo Horoscope in Telugu April 20
ప్రారంభించిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.
కన్య: Virgo Horoscope in Telugu April 20
కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu April 20 2023 Rasi Phalalu

తుల: Libra Horoscope in Telugu April 20
గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం: Scorpion Horoscope in Telugu April 20
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. ఇంటా బయట శాంతంగా వ్యవహరించాలి.
ధనస్సు: Sagittarius Horoscope in Telugu April 20
దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మరింత కష్టం తో గానీ ఫలితం లభించదు.
మకరం: Capricorn Horoscope in Telugu April 20
దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. జీవిత బాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధనదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరట చెందుతారు. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి.
కుంభం: Aquarius Horoscope in Telugu April 20
దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు ఊహించని లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు.
మీనం: Pisces Horoscope in Telugu April 20
కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. పనులు సకాలంలో పూర్తి కాకా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

నవంబర్ 26 – మార్గశిర మాసం -రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope డిసెంబర్ 24th గురువారం రాశి ఫలాలు

Sree matha

Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

Sree matha