NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి 22 – ఫాల్గుణ మాసం – సోమవారం.

మేషరాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. మీకోసం ఎదుటివారి కోసం కష్టపడతారు. సహాయం చేస్తారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ మీరు ఆకర్షిస్తారు. అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాలలో ప్రశంసలు పొందుతారు. క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్ పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గతంలో విడిపోయిన భార్య భర్తలు తిరిగే కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎదుటి వారితో తెలివిగా మాట్లాడి వారితో పనులు చేయించుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.
పరిహారాలుః ఈరోజు భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.ధనలాభం కలుగుతుంది !

బాగా అనుకూలంగా ఉంటుంది. నీతి నిజాయితీకి ధర్మానికి ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది. ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకుంటారు. ఈరోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గతంలో ఎదురుచూసిన అవకాశాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలించవు. విలువైన వస్తువులు ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటు తనం వల్ల అయిన వారిని దూరం చేసుకుంటారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 22 2021
today horoscope in telugu march 22 2021

సింహరాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఎలాంటి పని ప్రారంభించిన కలిసి వస్తుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. క్రొత్త క్రొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఉన్నత భావాలను కలిగి ఉంటారు. వ్యాపారాలంలో అధిక ఆర్థిక లాభాలు వస్తాయి. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. తక్కువ మాట్లాడడం మంచిది. రాబోయే రోజుల గురించి ఆలోచించి పెట్టుబడులు పెడతారు.
రెమిడీః ఈరోజు శివార్చన, శివాలయ ప్రదక్షనలు చేయండి.

కన్యారాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.ఈరోజు అనుకూలంగా లేదు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారితో కచ్చితంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందక ఇబ్బందులు కలుగుతాయి. ధననష్టం కలుగుతుంది. అనుకున్న పనులు ఆటంకాల వల్ల సరైన సమయానికి పూర్తి చేయలేక పోతారు. ఇంతకు ముందు చేసిన తప్పులు తిరిగి బాధ పెడతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు మీద శ్రద్ధ కోల్పోతారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.సాంస్కృతిక కళల మీద ఆసక్తి చూపుతారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. సాంస్కృతిక కళల మీద ఆసక్తి చూపుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. మితమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారాల్లో అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.ధననష్టం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు పనులు సరైన సమయానికి పూర్తి చేయలేక వాయిదా పడతాయి. ఆస్పత్రి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి. ఎదుటివారితో తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాల మీద శ్రద్ధ పెట్టి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో ఆటంకాలు. స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు సంకష్టహర గణపతిని ఆరాధించండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.దేవాలయ దర్శనాలు చేసుకుంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు తగ్గిపోయి పై అధికారుల మన్ననలు పొందుతారు. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. పెద్ద వారి ఆస్తులు సంక్రమిస్తాయి. మాట తీరు వల్ల అందరూ మమ్మల్ని ఆదరిస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. స్త్రీలకు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.నమ్మక ద్రోహం జరుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. నమ్మక ద్రోహం జరుగుతుంది. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. మీ రహస్యాలను బయటికి చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన విషయాలను మరిచిపోయి బాధపడతారు. సమయాన్ని సద్వినియోగ పరుచుకోకుండా వృధా చేస్తారు. స్త్రీలకు కుటుంబంలో పని వత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువు నిర్లక్ష్యం చేస్తారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.శుభవార్తలు వింటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఎవరికైనా సహాయం చేయాలని స్వభావాన్ని కలిగి ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగార్థులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. స్త్రీలకు లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

మీన రాశి Today Horoscope మార్చి-22- పాల్గుణ మాసం – సోమవారం.వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల, వారి మాటలను సూచనలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల చికాకు వల్ల మీరు అంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల వివాదాలు రావచ్చు. విద్యార్థులు ఒత్తిడికి లోనై, చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా కష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju