NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Breaking: నుపూర్ శర్మ పై లుకౌట్ నోటీసు జారీ చేసిన కోల్ కతా పోలీసులు

Breaking: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి బహిష్కరణకు గురైన నుపుర్ శర్మ పై పశ్చిమ బెంగాల్ కోల్ కతా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నుపూర్ శర్మ పై నార్కెల్ దంగా, అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లలో నమోదు అయిన ఫిర్యాదులపై విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఆమె హజరు కాలేదు. దీంతో పోలీసులు ఆమెపై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.

Kolkata Police issues Look Out Circular against suspended BJP leader Nupur Sharma

 

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నుపూర్ శర్మ పై నార్కెల్ దంగ పోలీసు స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా విచారణ నిమిత్తం గత నెల 20వ తేదీన హజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలను లెవనెత్తి నుపూర్ శర్మ గడువు కోరారు. అదే విధంగా అమ్హెర్స్ట్ స్ట్రీట్ పోలీసులు కూడా రెండు సార్లు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నాలుగు పర్యాయాలు పంపిన నోటీసులకు విచారణకు హజరు కాకపోవడంతో పోలీసులు ఆమెపై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.

నుపూర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత నెలలో బెంగాల్ లోని వివిధ జిల్లాల్లో జరిగిన పెద్ద ఎత్తున నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి,. వివిద ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుుకున్నాయి. ఈ క్రమంలోని వివిధ నగరాల్లోని పలు పోలీస్ స్టేషన్ లలో ఆమెపై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం మేరకు కోల్ కతాలోని వివిధ పోలీసు స్టేషన్ లలో పది కేసుల వరకూ సుపూర్ శర్మ పై నమోదు అయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ నుపూర్ శర్మపై కేసులు నమోదు అయినప్పటికీ ఏ రాష్ట్ర పోలీసులు ఆమె పై చర్యలకు తీసుకోలేదు.

వివిధ రాష్ట్రాల్లో నమోదు అయిన కేసులను తన భధ్రత దృష్ట్యా ఢిల్లీకి మార్చాలని కోరుతూ నుపూర్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ధర్మాసనం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె అభ్యర్ధనను తిరస్కరించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశంలో ఘర్షణలకు కారణమైన నుపూర్ శర్మపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఢిల్లీ పోలీసులను సైతం సుప్రీం కోర్టు మందలించింది. ఈ తరుణంలో కలకత్తా పోలీసులు ఆమె పై లుక్ ఔట్ నోటీసు జారీ చేయడం గమనార్హం.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N