NewOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

తీహార్ జైలులో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోలు వైరల్ ..బీజేపీ విమర్శలపై ఆప్ ఏ విదంగా సమర్ధించుకుంది అంటే..?

Share

ఢిల్లీ మంత్రి, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సత్యేందర్ జైన్ (58) మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ మే 30న అరెస్టు చెేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే సత్యేందర్ జైన్ కు జైలులో రాజభోగాలు అందుతున్నాయంటూ బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తుంది. జైలులో ఆయన బాడీ మసాజ్ చేయించుకుంటున్న వీడియోలను బీజేపీ తాజాగా విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియోలను షేర్ చేసిన బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియోల్లో సత్యేందర్ జైన్ కు జైలు బ్యారక్ లో ఒక వ్యక్తి మసాజ్ చేయడం, నలుగురైదుగురు వచ్చి ఆయనతో మాట్లాడటం కనిపిస్తుంది. జైలులో జైన్ కు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన క్రమంలోనే ఇవి బయటకు వచ్చాయి. దానికి సంబంధించి ఇటీవల తీహార్ జైలు సూపర్నిటెండెంట్ అజిత్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సిఫార్సు మేరకు ఈ చర్యలు చేపట్టారు.

Satyendar Jain Massage video viral

 

ఈ వీడియోలు ఇప్పుడు బీజేపీ అస్త్రంగా మారాయి. “జైలులో వీవీఐపీ సదుపాయాలు అందుతున్నాయి. సదుపాయాలు అందుతున్నాయి. అలాంటి మంత్రికి కేజ్రీవాల్ మద్దతు పలుకుతారా.. ? ఆయన్ను తొలగించకూడదా.. ? ఇది ఆప్ నిజస్వరూపాన్ని తెలియజేస్తొంది. నిబందనలన్నిటినీ చెత్తబుట్టలో పడేశారు” అంటూ బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “మీరు అవినీతి, వీవీఐపీ సంస్కృతిని రూపు మాపడానికి పార్టీని పెట్టారు. కానీ జైలులో అవినీతి నేతకు అన్ని సదుపాయాలు అందుతున్నాయి” అంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ భాటియా విమర్శించారు. బీజేపీ ఆరోపణలను ఆప్ ఖండించింది. జైలులో తమ పార్టీ నేతకు అందుతున్న సౌకర్యాలను సమర్ధించుకుంది ఆప్. జైన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనీ, ఆయనకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.

Advertisements

ఆయన వేసుకునే మందులతో పాటు ఆక్యుప్రెజర్ కూడా చికిత్స లో భాగమని తెలియజేస్తూ గాయపడిన వ్యక్తి చికిత్సకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను లీక్ చేసి ఇలాంటి దారుణ వ్యాఖ్యలకు పాల్పడటం బీజేపీకి మాత్రమే సాధ్యమని సిసోడియా అన్నారు. జైన్ కు వెన్నెముక దెబ్బతిన్నదని, ఈ విషయం రికార్డుల్లో కూడా ఉందని సిసోడియా తెలిపారు. మరో పక్క సత్యేందర్ జైన్ న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. జైలులోని సీసీ టీవీ పుటేజీ లీక్ కావడానికి ఈడీనే కారణమని ఆరోపించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈడీనే ఈ వీడియోలను లీక్ చేసిందని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్ ను విచారణ చేపట్టిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు .. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఈడీ పర్యవేక్షిస్తున్నప్పుడు వీడియో ఎలా లీకైందని స్పెషల్ జడ్జి వికాస్ ధూల్ దర్యాప్తు సంస్థను ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. మరో పక్క బీజేపీ నేతలు విడుదల చేసిన వీడియోలు పాతవి అని జైలు వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ కు క్యాన్సర్ వ్యాఖ్యల ఫలితం .. మర్రి శశిధర్ పై వేటు వేసిన పార్టీ అధిష్టానం


Share

Related posts

Alcohol: ఆ గుడిలో ప్రసాదం గా మందు పోస్తారట.. వామ్మో

Naina

మొదటి హిందూ మహిళా పోలీసు!

Siva Prasad

ఈ స్పెషల్ సంత గురించి తెలుసుకోవాల్సిందే..!

bharani jella