Amrit Udyan: రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ అందాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్దకెక్కాయనే విషయం తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దంచి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్ గా కేంద్రం శనివారం మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు డిప్యూటి ప్రెస్ సెక్రటరీ నావికా గుప్తా ఈ వివరాలు తెలిపారు.

మనదేశానికి స్వాతంత్య్రం సిద్దం 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను నిర్వహిస్తున్నామని నావికా గుప్తా తెలిపారు. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి భవన్ లోని ఉద్యానవనాలకు సమిష్టి పేరును రాష్ట్రపతి పెట్టారని తెలిపారు. వీటికి అమృత్ ఉద్యాన్ అని నామకరణం చేశారమని చెప్పారు. అమృత్ ఉద్యాన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం(రేపు) జనవరి 29న ప్రారంభిస్తారని తెలిపారు. ఇదే సందర్భంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 31 నుండి మార్చి 26వ తేదీ వరకు ప్రజలు ఈ ఉద్యాన వనాన్ని సందర్శించవచ్చని తెలిపారు. మార్చి 28 నుండి 31 వరకు రైతులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక బృందాలు సందర్శించేందుకు అనుమతిస్తామన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడి ఉద్యానవనంలో పూలు విరబూస్తాయన్న సంగతి తెలిసిందే.
అమృత్ ఉద్యాన్ లో చతురస్ర ఉద్యానవనం, సుదీర్ఘ ఉద్యానవనం, వృత్తాకార ఉద్యానవనం, హెర్బల్ ఉద్యానవనం, మ్యూజికల్ గార్డెన్, అధ్యాత్మిక ఉద్యానవనం ఉంటాయి. గార్డెన్ పేరు మార్పు నేపథ్యంలో ఇవేళ మొఘల్ గార్డెన్ అని పేరు ఉన్న ఫలకాలను తొలగించి అమృత్ ఉద్యాన్ అనే పేరు గల ఫలకాలను ఏర్పాటు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వైరల్ కామెంట్స్.. వైసీపీ నేతల సెటైర్ లు