కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కేజీఎఫ్ – 2 సినిమాలోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించినట్లు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు జైరామ్ రమేష్, సుప్రియ శ్రినాటే పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, కేసును కొట్టివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా సోర్స్ కోడ్ ను ట్యాంపర్ చేసినట్లు కనిపిస్తొందనీ, ఇది నిస్సందేహంగా కంపెనీ కాపీరైట్ ను ఉల్లంఘించడమవుతుందని తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత ఏడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కన్నడ సినిమా కేజీఎఫ్ – 2 లోని మ్యూజిక్ ను అనధికారికంగా వాడుకున్నారని ఎంఆర్టీ మ్యూజిక్ ఫిర్యాదు చేసింది. ఈ మువీలోని పాటలతో రెండు వీడియోలను కాంగ్రెస్ విడుదల చేసిందనీ, దీనికి తమ అనుమతి లేదని తెలిపింది. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించి, ఈ పాటల మ్యూజిక్ ను కాంగ్రెస్ వాడుకుందని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రాహుల్ తదితరులపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలు, ఐపీసీ సెక్షన్ల ప్రకారం యశ్వంత్ పూర్ పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది.
రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి లో ప్రారంభించారు. దాదాపు 145 రోజుల పాటు సుమారు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ తన యాత్రను కశ్మీర్ లో ముగించారు.
గన్ మిస్ ఫైర్ .. హెడ్ కానిస్టేబుల్ మృతి