NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Maharastra: శరద్ పవార్ కు బిగ్ షాక్ .. తన మద్దతుదారులతో అజిత్ పవార్ తిరుగుబాటు .. డిప్యూటీ సీఎంగా ప్రమాణం

NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis

Maharastra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అజిత్ పవార్ బిగ్ షాక్ ఇచ్చారు. తన మద్దతుదారులతో అజిత్ పవార్ ఎన్డీఏలో చేరారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉండగా, ఇప్పుడు రెండో డిప్యూటి సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు.

NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis
NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis

 

పవార్ తో పాటు ఛగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి తట్కర్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ముంబాయిలోని రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. అజిత్ పవార్ తో పాటు మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం ఏక్ నాథ్ శిండే. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హజరైయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లే ముందు పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో అజిత్ పవార్ సమావేశమైయ్యారు. ఈ భేటీపై తనకు సమాచారం లేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొనడం విశేషం. అయితే ఈ భేటీకి శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుప్రీయా సూలే హజరు అయ్యారు. కానీ సమావేశం అనంతరం ఆమె రాజ్ భవన్ కు వెళ్లలేదు.

ఇటీవల ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రీయా సూలే, ప్రపుల్ పటేల్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అప్పటి నుండి అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అదునుగా సీఎం ఏక్ నాథ్ శిండే పావులు కదిపారు. అజిత్ పవార్ తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏక్ నాథ్ శిండేతో కలిసి అజిత్ పవార్ సమావేశమైయ్యారు. ఇవేళ అకస్మాత్తుగా ఎన్డీఏలో చేరడం ఎన్సీపీలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఎన్సీపీలో మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్ పవార్ కు 29 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరిగింది. అయితే ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపారని మహరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్ కులే తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం .. పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju