ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. ప్రధాని మోడీ తల్లి తల్లి హీరాబెన్ (100) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం వేకువజామున అహ్మాదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లుగా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరల ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం ఆమె తుదిశ్వాస విడిచారు. తన తల్లి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని పేర్కొన్నారు. అమ్మను దేవుడి చిహ్నంగా భావించానన్నారు. విలువలకు కట్టుబడ్డ నిస్వార్ధ కర్మయోగిగా అమ్మ జీవించారని రాసుకొచ్చారు.

హీరాబెన్ స్వస్థలం మోహసాలోని వాద్ నగర్. హీరాబెన్, దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ దంపతులకు అయిదుగురు కుమార్తెలు. ఒక కుమార్తె. పెద్ద కుమారుడ సోమ మోదీ ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారి కాగా, రెండో కుమారుడు పంకజ్ మోదీ గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్ గా పని చేశారు. మరో ఇద్దరు కుమారుల్లో అమృత్ మోదీ రిటైర్డ్ లేత్ మెషిన్ ఆపరేటర్ కాగా, ప్రహ్లాద్ మోదీ రేషన్ దుకాణ యజమానిగా, అఖిల భారత రేషన్ డీలర్ల సంఘ నేతగా ఉన్నారు. వారి మూడవ సంతానం నరేంద్ర మోదీ. భర్త మరణం తర్వాత హీరాబెన్ గాంధీనగర్ శివారులోని రైసన్ గ్రామంలో చిన్న కుమారుడైన పంకజ్ మోడీతో కలిసి ఉంటున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున (డిసెంబర్ 4న) అహ్మదాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ను కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ ఎన్నికలకు ముందు జూన్ 18న హీరాబెన్ తన వందవ పుట్టిన రోజు సందర్భంగా మోడీ తన తల్లిని కలిశారు. అంతకు ముందు మార్చిలో రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న సమయంలోనూ తల్లి వద్దకు మోడీ చేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేశాన్ని ఏలే రాజైనా తల్లికి కుమారుడే అన్నట్లుగా ప్రధాని మోడీ .. తన తల్లి పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవంగా ఉండేవారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022