అడిలైడ్ : భారత్ విజయానికి 4 వికెట్లు

ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి  టెస్టు రసవత్తరంగా మారింది. ఈ టెస్టులో విజయం సాధించాలంటే భారత్ మరో నాలుగు వికెట్లు తీయాలి. అదే ఆస్ట్రిలియా అయితే విజయానికి ఇంకా 137 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ ఐదో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 250, రెండో ఇన్నింగ్స్ లో 307 పరుగులు చేయాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 135 చేసిన సంగతి తెలిసిందే. 323 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది.