పొంచిఉన్న వాయుగుండం

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 15 నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.   రెండురోజుల పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కోస్తాజిల్లాలలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుపై కూడా వాయుగుండం ప్రభావం కనిసిప్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచింది. అలాగే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీర ప్రాంతాలలో గంటకు 60 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా వాయుగుండం ప్రభావం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.