హ్యాపీనెస్ట్ బుకింగ్స్ నేడు

హ్యాపీ నెస్ట్ రెండో దశ ఆన్ లైన్ బుకింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈ  ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా హ్యాపీ నెస్ట్ లో 9 టవర్లలో 900 ప్లాట్లబుకింగ్ ప్రారంభం అవుతుంది.ఇందు కోసం అన్నిమీసేవా కేంద్రాలలోని కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే హ్యాపీ నెస్ట్ లో ప్లాట్ బుక్ చేసుకున్న వారికి తక్షణమే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కౌంటర్లు తెరిచాయి. హ్యాపీనెస్ట్ తొలి దశకు వచ్చిన అద్భుత స్పందన నేపథ్యంలో రెండో దశ ఆన్ లైన్ బుకింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

SHARE