NewsOrbit
న్యూస్

108 కి అప్పుడే అష్టకష్టాలు…!!

108 amulance facing problems in andhra pradesh

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా, ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. జూలై 1వ తేదీన ప్రారంభించిన సర్వీసులు ఆశించినట్టుగా పని చేస్తున్నాయా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

108 amulance facing problems in andhra pradesh
108 amulance facing problems in andhra pradesh

ఈ నెల రోజుల్లో వాటి పనితీరును సమీక్షిస్తే కేవలం 30 శాతం మాత్రమే సక్సెస్ రేటు కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా డ్రైవర్లు అందుబాటులో లేకపోవడం, వారికే కరోనా సోకడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 108 సర్వీసులు సకాలంలో అందక కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి.అధునాతల టెక్నాలజీని ఈ ఆంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు.

అయితే.. బాధితుల ఫోన్ కాల్ చేసిన 15 నిముషాల్లోనే అందుబాటులోకి రావాల్సి ఉన్నా రావడం లేదు. కొన్నిచోట్ల గంటల్లో కూడా ఆలస్యమవుతున్నాయి. కరోనా కేసుల్లో సరైన సమయంలో వైద్యం అందటం లేదు. చాలా చోట్ల మున్సిపాలిటీ బండ్లలో, ఆటోల్లో బాధితులను చేరవేస్తున్నారు. కొందరు ప్రైవేటు ఆంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు పోతున్నాయి.

ఇదే అవకాశంగా ప్రైవేటు ఆంబులెన్సులు దోపిడీకి పాల్పడుతున్నాయి. మండలానికో ఆంబులెన్సు ఉన్నా ప్రజలకు ఉపయోగపడడం లేదని ప్రతిపక్షాలు కూడా గొంతెత్తుతున్నాయి.nగతంలో జీవీకే సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వీసుల నిర్వహణ సరిగా లేదంటూ అరబిందో సంస్థకు అప్పజెప్పారు. ఇప్పుడు అరబిందో నిర్వహణలో కూడా ఈ జాప్యం జరిగితే సంస్థతోపాటు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

\కొన్నిచోట్ల నిర్వహణ బాగున్నా అక్కడక్కడా క్షేత్రస్థాయిలో సరైన పనితీరు సరిగా లేకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిత్యం జాగ్రత్తగా ఉండాల్సిందే. సిబ్బందిని నియమించుకోవడం, పర్యవేక్షణ తప్పనిసరి చేయాల్సిందే. ఇందులో అరబిందో సంస్థ కూడా బాధ్యత తీసుకోవాల్సిందే. సీఎం జగన్ 108 నిర్వహణపై మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించి లోపాలను సరిదిద్దాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N