NewsOrbit
న్యూస్

9/11.. అమెరికాపై ఆల్ ఖైదా దాడికి 19 ఏళ్లు..

19 years for al queda attack on america

ప్రపంచంలో అగ్రరాజ్యంగా కీర్తించబడే అమెరికా.. చిగురుటాకులా వణికిన రోజు.. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించే అగ్రరాజ్యం ఉగ్రదాడులకు బలైపోయిన రోజు.. ఉగ్రవాదంలో మరిగిపోతున్న ఆల్ ఖైదా తన ప్రతాపం చూపిన రోజు.. సెప్టెంబర్ 11’ 2001. ఈ తేదీని మర్చిపోవడం అమెరికన్లకు అంత సులభం కాదు. ఒసామా బిన్ లాడెన్ ఆధ్వర్యంలో నాలుగు విమానాలు హైజాక్ చేసి అమెరికా స్థైర్యం ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో ఉగ్రవాదులు తెగబడ్డారు. న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ గా పిలిచే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను రెండు విమానాలు నేలమట్టం చేశాయి. మూడో విమానం వాషింగ్టన్ లోని శత్రు దుర్భేధ్యమైన పెంటగాన్ పై దాడి చేసింది. నాలుగో విమానం నివాసం వైట్ హౌస్ లక్ష్యంగా వెళ్తూండగా ప్రయాణికుల తిరుగుబాటు, అలజడి కారణంగా పెన్సిల్వేనియాలోని పొలాల్లో పడిపోయింది. ఈ దారుణ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు.

19 years for al queda attack on america
19 years for al queda attack on america

ఆరోజు ఎంత భీభత్సం జరిగిందంటే

అమెరికన్ వార్తా సంస్థల ప్రకారం.. ఆరోజు ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ దారుణకాండలో మొత్తం 19 మంది ఉగ్రవాదులతో సహా 2,977 మంది చనిపోయారు. నాలుగు విమానాల్లోని ప్రయాణికులు అందరూ మృతి చెందారు. టవర్స్ ను విమానాలు ఢీ కొట్టడం ద్వరా సుమారు 10 వేల గ్యాలన్ల ఇంధనం మండింది. దీంతో 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని.. ఆ వేడికి భవనాలు కుప్పకూలిపోయాయి. దుమ్ము, ధూళి ఆవరించి ఎందరి ప్రాణాలో గాల్లో కలిసిపోయాయి. పెంటగాన్ పై జరిగిన దాడిలో 184 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది పౌరులే ఉన్నారు. విదేశీయుల సంఖ్య కూడా ఎక్కువే. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు నేటికీ ఈ విలయం గుర్తొస్తే వణికిపోతారు.

ప్రతీకారం తీర్చుకున్న అమెరికా..

9/11 గా అమెరికా వర్ణించే ఈ రాక్షసకాండకు ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. లక్షకు పైగా టన్నుల స్టీల్ ను అమెరికాలో అనేక చోట్ల ఉపయోగించగా.. కొంత ఇండియా, చైనాకు విక్రియించారు. ట్విన్ టవర్స్ నేల కూలిన ప్రాంతాన్ని అమెరికా ‘గ్రౌండ్ జీరో’గా పిలుచుకుంటారు. ప్రతి ఏటా అక్కడ మృతులకు నివాళులర్పిస్తారు. దాడుల సమయంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి బుష్ ఆల్ ఖైదా.. ఒసామా బిన్ లాడెన్ అంతం చూడాలని వేట కొనసాగించారు. వందల కోట్లు ఖర్చు చేశారు. చివరికి ఒబామా అధ్యక్షుడు అయ్యాక ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ లో అంతమెందించారు.

 

author avatar
Muraliak

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju