తూర్పుగోదావరిపై పెథాయ్ తీవ్ర ప్రభావం

పెథాయ్ పెను తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా కనిపిస్తున్నది. నిన్న సాయంత్రం నుంచీ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానకు పడుతున్నాయి. ముఖ్యంగా కోనసీమలో భారీ వర్షపాతం నమోదౌతున్నది. నిన్న సాయంత్రం నుంచీ నేటి ఉదయం వరకూ కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం డివిజన్ లోని ఆత్రేయపురం మండలంలో అత్యధికంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అంబాజీపేట మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచీ ఈ ఉదయం వరకూ నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. అలాగే రావులపాలెం 22, కొత్తపేట 25.4 మి.మి, ముమ్మిడివరం 25 మి.మి, అయినవిల్లి 25.4 మి.మి,పి గన్నవరం 22.4 మి.మి, ఐ పోలవరం మండలం 18.4 మి.మి,మామిడికుదురు 23.2, రాజోలు 34.8, మలికిపురం 30.4, సఖినేటిపల్లి 27 మి.మి,
అల్లవరం 21.08 మి.మి, ఉప్పలగుప్తం 20.2 మి.మి మరియు కాట్రేనికోన 20.08 మి.మిగా నమోదయ్యాయి. తీర ప్రాంతాలలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఉండగా కాకినాడ దుములుపేట చెందిన ఆరుగురు మత్స్యకారులు ఈనెల 11న సముద్రంలో వేటకు వెళ్లి తుఫాన్ లో చిక్కుకున్నారు యానానికి పది కిలోమీటర్ల దూరంలో ఇంజిన్ బోటు పాడవడంతో సముద్రంలో చిక్కుకున్న ట్లు స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఇక తుపాను కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వాటి వివరాలిలా ఉన్నాయి. రత్నాచల్‌, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, రైళ్లను రద్దు చేశారు.
అలాగే మెమూ ప్యాసింజర్లు… విజయవాడ- రాజమండ్రి, రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్లు, విశాఖ- కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-విజయవాడ, విజయవాడ- తెనాలి, తెనాలి- గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. డెమూ ప్యాసింజర్లు…. రాజమండ్రి- భీమవరం, భీమవరం- నిడదవోలు, భీమవరం- విజయవాడ డెమూ ప్యాసింజర్‌, రాజమండ్రి- నరసాపురం, నరసాపురం- గుంటూరు, గుంటూరు- విజయవాడ, విజయవాడ- మచి లీపట్నం రైళ్లు రద్దు అయ్యాయి.