తెలుగు బిగ్ బాస్ సీజన్ 4- Bigg Boss season 4 విన్నర్ అభిజిత్- Abhijeet, బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో తన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. సీసన్ 4 మొత్తంలో కేవలం ఒకటీ లేదా రెండు సందర్భాల్లో మాత్రమే అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఇంత మెచూరిటీ తో తను ఉండడం వలెనే అభిజిత్ వేరే కంటెస్టెంట్స్ కన్నా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక అభిజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అభిజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా గా ఓ బుల్లి చైల్డ్ ఆర్టిస్ట్ అభికి ఫ్యాన్ ని అని అభిజీత్ ని కలిసింది. ఆ పాప ఎవరంటే…
స్టార్ మా- Star Maa ఛానల్ లో ప్రసారమయ్యే “కార్తీకదీపం”- Kartheeka Deepam సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బేబీ కృతిక, అలియాస్ శౌర్య అభిజిత్ ను కలిసింది. అభి తో ఒక సెల్ఫీ కూడా తీసుకుంది. బీబీ 4 విన్నర్ ఈ మధ్యకాలంలో తాను హౌస్ లోపల ఉన్నప్పుడు తనకు బాగా సపోర్ట్ ఇచ్చిన వారిని కలుస్తూ ఉన్నాడు. ఇప్పటికే నాగబాబు, విజయ్ దేవరకొండ- Vijay Devarakonda అలాగే శేఖర్ కమ్ములను కూడా అభిజిత్ కాలిసాడు.
ప్రస్తుతం అభిజీత్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల అభి కార్తీక దీపం సీరియల్ లో ఒక గెస్ట్ రోల్ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, “ఎఫ్3”- F3 లో అభి ఒక కీలక పాత్రని పోషించనున్నట్లు తెలుస్తుంది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అభి పట్ల ఇంప్రెస్ అయ్యి సడెన్ గా ఈ రోల్ ను క్రియేట్ చేయడం జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!