Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..! ఇటీవల అల్లు అర్జున్ కి కరోనా సోకడంతో #GetWell SoonAlluArjun అంటూ ట్విట్టర్లో అల్లుఅర్జున్ కోలుకోవాలి అంటూ ప్రార్థనలు చేశారు..! అల్లు అర్జున్ తన ఆరోగ్యం బాగానే ఉంది, కరోనాతో మైండ్ సెంటెన్స్ ఉన్నాయని చెప్పాక కానీ అభిమానులు శాంతించలేదు..! తాజాగా అల్లు అర్జున్ తన లేటెస్ట్ చిత్రం పుష్ప కి ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూసి అల్లు అర్జున్ పరవశించి పోయాడు..!! అంతేకాదు ట్విట్టర్ లో ఈ పోస్టర్ పై స్పెషల్ ట్వీట్ చేశారు..!!
ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మాస్ లుక్, రష్మిక భుజాన కాడి వేసుకున్న లుక్, ఇంకా అల్లు అర్జున్ మాస్ లుక్, అలాగే అల్లు అర్జున్ అల్లు లుంగీ కట్టి గొడ్డలి పట్టిన లుక్, అల్లు అర్జున్ లాంతరు పట్టుకొని రౌడీలను వేటాడే లుక్ తో అల్లు అర్జున్ పుష్ప ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ ని తయారుచేసి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.. తాజాగా ఈ పోస్టర్ చూసిన అల్లు అర్జున్.. ఐ లవ్ లవ్ లవ్ గ్రాఫిక్స్..! లవ్డ్ థిస్ ఫ్యాన్ మేడ్ పోస్టర్.. థాంక్యూ అంటూ ట్వీట్ చేయడం చూసిన అభిమానులు పులకరించిపోతూన్నారు.. ప్రస్తుతం పుష్ప ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. పుష్ప టీజర్ రికార్డులను సృష్టిస్తోంది.. టాలీవుడ్లోనే 60 మిలియన్ల వ్యూస్, 1.4 మిలియన్ల లైక్స్ సాధించిన ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డు బద్దలు కొట్టింది..
I love love love graphics ! Loved this fan made poster . Thank you ? pic.twitter.com/J2ktVktbdV
— Allu Arjun (@alluarjun) May 5, 2021
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!