NewsOrbit
జాతీయం న్యూస్

Amith Shah: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో షా ఉగ్రరూపం..! పీకే టార్గెట్ గా ఆడియో టేపులు, కన్నింగ్ రాజకీయాలు..!!

Amith Shah: వెస్ట్ బెంగాల్ లో పాగా వేసేది ఎవరు ? మరోసారి టీఎంసీ అధికారం దక్కించుకుంటుందా ? సీఎం మమతకు బీజెపీ చెక్ పెట్టి..కాషాయ జెండా రెపరెపలాడిస్తుందా ? అంటే..ఇప్పుడే సమాధానం చెప్పలేం. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ప్రస్తుతం 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో…సోషల్ మీడియాలో తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, అది మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Amith Shah's fury in West Bengal elections ..!
Amith Shah’s fury in West Bengal elections ..!

Amith Shah: ఆడియో టేపు బయటపెట్టిన బిజెపి!

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.ఈ ఆడియో టేప్ పై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఆడియో కాదని ఖండిస్తున్నారు. ఆడియోలో కొంత భాగం కాదు..మొత్తం ఆడియో చాట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని మరోసారి ప్రశాంత్ జోస్యం చెప్పారు.

బీజేపీకి పీకే ఓపెన్ ఛాలెంజ్!

ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా బాగా పేరు పొందారు. ఎలాగైనా సీఎం మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పీకే వ్యూహాలు రచించారు. బెంగాల్ ఎన్నికలు ప్రస్తుతం నాలుగో దశ కొనసాగుతున్నాయి. మొత్తం 8 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నెల 29వ తేదీతో ముగియడం, మే 02వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైనే ఉంది. పీకే రచించిన వ్యూహాలు వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేదానిపై చర్చ జరుగుతోంది.
బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను తన పని వదిలేస్తానని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని గతంలో కుండబద్ధలు కొట్టారాయన. తద్వారా బీజేపీకి ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.తృణమూల్ కాంగ్రెస్ తనంతట తాను పతనమైతే తప్ప బెంగాల్ లో బీజేపీ గెలవలేదని స్పష్టం చేశారు.

బెంగాల్ టు పంజాబ్!

బెంగాల్ బాధ్యతలు ముగిసిన అనంతరం పంజాబ్ రాష్ట్రానికి ప్రశాంత్ కిశోర్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పీకే ప్రయత్నాలు చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్ కు ప్రిన్స్ పల్ అడ్వైజరీ గా ఈయన నియమితులయ్యారు.

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju