Anasuya : తెలుగు హాట్ యాంకర్ అనసూయ Anasuya తెలియని వారు ఎవరూ ఉండరు. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సాధించిన అనసూయ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడమే కాక కీలకమైన క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ ఉంది. ఈ విధంగా అప్పట్లో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర లో కీలకంగా నటించి సినిమాకే హైలెట్ అవ్వటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అనసూయ తెలుగులో మాత్రమే కాక సౌతిండియాలో తమిళ్ ఇంకా మరి కొన్ని భాషల్లో నటించడానికి కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ విషయాలు అదేవిధంగా కెరియర్ గురించి అనేక విషయాలు ఈ సమాజంలో జరిగే వాటి గురించి నెటిజన్లకు అభిమానులతో పంచుకుంటూ ఉంటది. అదేరీతిలో తన ఫోటోలకు సంబంధించి ఇంకా వేరే విషయాల గురించి చెత్త చెత్త గా మాట్లాడే నెటిజన్లకు ఓ రేంజ్ లో అనసూయ వార్నింగ్ లు ఇప్పటి వరకు చాలా మంది ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రీతిగానే ఓ నెటిజెన్ అనసూయ ని రీసెంట్ గా ఘాటుగా విమర్శించాడు.
మేటర్ లోకి వెళ్తే జబర్దస్త్ స్టార్ట్ అయ్యి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో కేక్ కటింగ్ జరిగిన క్రమంలో కమెడియన్స్ తాము ఎలా ఉండేవాళ్ళం జబర్దస్త్ లైవ్ పిచ్చగా ఎలాగా జీవితం మారింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో.. స్టేజిపై అక్కడే ఉన్న అనసూయ కళ్ళు తిరిగిపడిపోయిన పిక్ ని తాజాగా ఓ నెటిజన్ షేర్ చేసి… రాయలేని, అనకూడని మాటలు కామెంట్లా రూపంలో పెట్టడం జరిగింది. దీంతో ఫుల్ కోపం వచ్చిన అనసూయ నీలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే ఇంకా చాలా మంది రెచ్చిపోతారు అంటూ అదిరిపోయే కౌంటర్లు వేసింది. ఇది ఎప్పుడో మూడు సంవత్సరాల కాలం నాటి వీడియో దాన్ని పట్టుకుని, చెత్త చెత్త వాగుడు వాగుతున్నావు అంటూ కడిగి పారేసింది. నీలాంటి వాడికి రిప్లై ఇవ్వటం కూడా దండగే, కానీ నీకు కనుక రిప్లై ఈ విధంగా ఇవ్వకపోతే మీలాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో చాలామంది తయారవుతారు అంటూ.. తన స్టైల్ లో అనసూయ భారీగా సదరు నెటిజన్ కి తనదైన శైలిలో కౌంటర్లు వేసింది. దీంతో సదరు నెటిజన్ కి అనసూయ కామెంట్ల రూపంలో ఇచ్చిన వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!