Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల ముందు తన పరువు తానే పోగొట్టుకుంటున్న యాంకర్ రవి..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాలుగో వారం విజయవంతంగా కొనసాగుతోంది. గత సీజన్లో తో పోలిస్తే ఈసారి సీజన్ లో.. హౌస్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ వాతావరణం గాని టాస్క్ పరంగా… సరైన గేమ్స్ ఏది కూడా బిగ్బాస్ ఇవ్వటం లేదని బయట జనాల టాక్. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో కంటే.. సీజన్ ఫైవ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే నాలుగో వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాత.. హౌస్ లో సరికొత్త వాతావరణం ఏర్పడింది. గుంటనక్క మేటర్ లో యాంకర్ రవి… గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు.. ఇంటిలో కెమెరాల చుట్టూ నేనే కదా గుంటనక్క అంటూ.. తనకి తానుగా నటరాజ్ మాస్టర్ దగ్గర ఒప్పేసుకున్నాడు. అంత మాత్రమే కాక క్లారిటీ ఇవ్వాలి అంటూ కెమెరాల ముందు నటరాజు మాస్టర్ ని బలవంతం చేయడం జరిగింది.

అయితే ఈ క్రమంలో.. నటరాజ్ మాస్టర్ ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్న ఈ విషయంలో అని రవికి క్లారిటీ ఇవ్వకుండా మళ్లీ సస్పెన్స్ లో పెట్టేస్తాడు. ఈ క్రమంలో అందరూ చూస్తున్నారు రియాల్టీ షో క్లారిటీ ఇవ్వండి మాస్టర్… అని రవి నటరాజ్ మాస్టర్ వద్ద బతిమిలాడ గా నువ్వు ఇతరులను ప్రభావితం చేయదు బ్రదర్ అంటూ పరోక్షంగా గుంటనక్క నువ్వే అన్న రీతిలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా బుల్లి తెర పై తనకంటూ సెపరేట్ గుర్తింపు కలిగిన యాంకర్ రవి.. బిగ్ బాస్ హౌస్ లో.. తన పరువు తానే తీసుకొనే రీతిలో గుంటనక్క విషయంలో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు.. ఇంటిలో ప్రతి కెమెరా ముందు తన పరువు తానే తీసుకుంటున్నాడని నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ కార్యక్రమం అనంతరం.. హౌస్ లో రవి వ్యవహరించిన తీరుపై బయట జనాల టాక్.

Bigg Boss 5 Telugu: నాగార్జున వేదికపై గుంటనక్క ఎవరు..?

యాంకరింగ్ వరంగా.. బుల్లితెరపై హౌస్లో రాకముందు వరకు రవి.. ఇతరులను భయంకరంగా ఏడిపించటం పంచులు వేయడం జరిగింది. ఏ సీజన్ ఫైవ్ అనంతరం రవి బయటకు వచ్చాక అతడి ట్యాగ్ లైన్ గా గుంటనక్క అనే టైటిల్ మారిపోయే పరిస్థితి ప్రస్తుతం తనకుతానే రవి క్రియేట్ చేసుకున్నాడని.. జనాలు అంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా చాలా వరకూ తెలుగులో గుర్తింపు పొందగా, యాంకర్ రవి మాత్రం హౌస్ లో అడుగు పెట్టి తన పరువు తానే తీసుకున్నాడు అని అతడు ఆడుతున్న ఆటతీరుపై.. జనాలు బయట డిస్కషన్లు చేసుకుంటున్నారు. రవి కెరియర్ లో.. ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్.. మాయని మచ్చగా మిగిలిపోతుందని.. ఇదే క్రమంలో ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వేదికపై గుంటనక్క ఎవరు అంటూ.. ప్రతిసారి ప్రశ్న వేయటం ఆ సమయంలో ఇంటి సభ్యులు అంతా రవి వైపు చూడటం..తో.. హౌస్ లో రవి గేమ్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని జనాలు అంటున్నారు.

Bigg Boss 5 Telugu : రాత్రి అలా పగలు ఇలా.. అడ్డంగా బుక్కైన యాంకర్ రవి | The Telugu News

రవికి ఇంటిలో నిద్ర లేకుండా చేస్తున్న టైటిల్…

ఏది ఏమైనా గుంటనక్క టైటిల్ రవికి ఇంటిలో నిద్ర లేకుండా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రియ లహరి హగ్ గొడవలో… వీడియో లో యాంకర్ రవి అడ్డంగా బుక్ కావడం.. అతడికి పెద్ద మైనస్ అని కూడా చెప్పుకొస్తున్నారు. అజయ్ వీడియో యాంకర్ నాగార్జున ఇంటి సభ్యుల ముందు ప్లే చేసి ఉంటే.. హౌస్ లో రవి తలెత్తుకోలేక ఉండటం గ్యారెంటీ అని.. అందువల్లే నేమో నాలుగో సారీ ఎలిమినేషన్ నామినేషన్ తర్వాత కాజల్ రవి తన దగ్గరకు వచ్చిన టైంలో జాగ్రత్త పడినట్టు ఉందని.. బయట జనాలు భావిస్తున్నారు.

 


Share

Related posts

BREAKING: మ‌ల్టీప్లెక్స్‌ ప్రారంభమయ్యేది ఆ రోజే.. విజయ్ దేవరకొండ ప్రకటన వైరల్..!

amrutha

టాక్సిసిటీ వల్లనే ఆవుల మృతి:తేల్చిన సిట్

somaraju sharma

AP High Court : ఏపి హైకోర్టులో ఎస్ఈసీకి రెండు ఎదురుదెబ్బలు

somaraju sharma