ట్రెండింగ్ న్యూస్ సినిమా

యాంకర్ కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటో చెప్పిన సుమ..! ఎవరివల్లా కాలేదు… ఆమె ఒక్కటే చేసి చూపించింది

Share

తెలుగు బుల్లితెరపై ఎన్నో సంవత్సరాల నుండి అగ్ర యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల ప్రస్తుతం తన కెరీర్ లో టాప్ ఫామ్ లో ఉంది. రష్మీ, అనసూయ, విష్ణుప్రియ, శ్రీముఖి, భాను, లాస్య వంటి ఎంతో మంది యాంకర్లు వచ్చినా కూడా ఈమె క్రేజ్ కు ఆమడదూరంలో నిలిచిపోయారు. అలాంటి సుమ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో జనాలను ఎంటర్టైన్ చేస్తోంది.

 

ప్రస్తుతం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో తో బిజీ అయిపోయిన సుమ కు కో-హోస్ట్ గా రవిని పెట్టారు. ప్రతివారం సెలబ్రిటీలను తీసుకొస్తుంది. వారితోపాటు విన్యాసాలు చేసే కంటెస్టెంట్లను కూడా పట్టు వస్తుంది. అలాగే ఈ వారం ఒక ముగ్గురు హోస్ట్ లు వచ్చారు. ఇక ఈ వారం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కు వచ్చారు. ఇక వీరందరూ సుధీర్ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు.

ఇదే సందర్భంగా సుమ మాట్లాడుతూ మీ ముగ్గురితో కలిసి నేను యాంకరింగ్ చేయాలా అని అనింది. మా ముగ్గురి పక్కన మీరు సరిపోరని రామ్ ప్రసాద్ ఒక కౌంటర్ వేస్తాడు. అందుకు బదులుగా సుమ యాంకర్ అవ్వాలంటే ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా…? అని అందరికీ కౌంటర్ వేసింది.

యాంకర్ అనిపించుకోవాలంటే ముందుగా స్పాన్సర్స్ పేర్లు టకా టకా చెప్పాలి అని సుమ తెలిపింది. అలా ఆపకుండా స్పాన్సర్ పేర్లను ఎవరైనా చెప్పగలరా అని సవాలు విసిరింది. మొదట యాంకర్ రవి ప్రయత్నించి దెబ్బతిన్నాడు. తర్వాత గెటప్ శ్రీను కూడా చెప్పాలని ట్రై చేశాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. ఎంతైనా సుమ… సుమ నే.


Share

Related posts

RRR: ఫస్ట్ డే కలెక్షన్స్..అన్ని కోట్లు రాబట్టే సత్తా చరణ్, తారక్‌లకు లేదా…?

GRK

Eatala Rajender: జ్వరంతో ఈటల అస్వస్థత..! పాదయాత్రకు బ్రేక్..!!

somaraju sharma

బిగ్ బాస్ 4 : హౌస్ లో వాళ్ళిద్దరూ నిజమైన రాక్షసులు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar