Anchor Vishnupriya: అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. యాంకర్ శ్రీముఖి తర్వాత అంతే ఎనర్జీతో ఉండే యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya మాత్రమే. ఇప్పటికే చాలా షోలకు యాంకరింగ్ చేసింది విష్ణుప్రియ. ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితమైన విష్ణుప్రియ అప్పుడప్పుడు పలు ఈవెంట్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తుంటుంది.
Dancee+ షోలో Anchor Vishnupriya
స్టార్ మాలో ఇటీవల డ్యాన్స్ ప్లస్ అనే షో ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోకు ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇది నెక్స్ ట్ లేవల్ డ్యాన్స్ షో. జడ్జిలు కూడా అందరూ కొరియోగ్రాఫర్లు. ముమైత్ ఖాన్, మోనల్ గజ్జర్ కూడా ఈషోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా ఈ షోకు యాంకర్ విష్ణుప్రియ వెళ్లింది. ఇక.. విష్ణుప్రియ వెళ్లాక డ్యాన్స్ ప్లస్ షో స్టేజ్ మామూలుగా ఉంటుందా? విష్ణుప్రియ తన డ్యాన్స్ తో అదరగొట్టేసింది. దెబ్బకు అందరూ నోరెళ్లబెట్టారు. తన నడుమును చూపిస్తూ… డ్యాన్స్ ప్లస్ కంటెస్టెంట్లు రామ్, లక్ష్మణ్ తో కలిసి విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ మామూలుగా లేదు.
ఏంటి.. కంటెస్టెంట్లు అందరూ అక్కడ లాక్ అయ్యారు.. అంటూ బాబా భాస్కర్ ప్రశ్నించగా.. విష్ణుప్రియ నడుము దగ్గరికి వస్తే మీరు కూడా లాక్ అవుతారు.. అంటూ ఓంకార్ అన్నయ్య పెద్ద బాంబు పేల్చాడు. దీంతో స్టేజ్ మొత్తం నవ్వులే నవ్వులు.
మొత్తానికి విష్ణుప్రియ డ్యాన్స్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.