NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అవని తడిసే… అన్నదాత మురిసే…!!(జగన్ కి బాగా కలిసొచ్చింది)

వరుణ దేవుడు నాడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం పై కరుణ చూపాడు.. నేడు ఆయన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంపై కరుణ చూపుతున్నాడు. అందుకు స్పష్టమైన ఉదాహరణలు కనబడుతున్నాయి. నాడు సంవృద్దిగా వర్షాలు కురిశాయి. నేడు కురుస్తున్నాయి. ప్రాజెక్టు లో జలకళ ఉట్టిపడుతోంది.

చంద్రబాబు నాయుడు పరిపాలించిన 2014 నుండి 2019 వరకు .. అయిదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు విపరీతమైన కరువు, దుర్భిక్ష పరిస్థితి  ఉంది. రెండేళ్లలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో మాత్రం అయిదు సంవత్సరాలు దుర్భిక్ష పరిస్థితే తాండ వించింది. చంద్రబాబుకు కాలం, పకృతి రెండు కలిసి రాలేదు. జగన్ కు మాత్రం కాలము పకృతి రెండు కలిసి వచ్చాయి. వస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన రెండు ఏళ్ళు 2019 వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఇప్పుడు 2020 వర్షాకాలం లోనూ వర్షాలు పడుతున్నాయి. అదనపు వర్షపాతం రైతులను ఆనంద భరితులను చేస్తున్నది. రిజర్వాయర్లకు జలకళ కనిపిస్తోంది.

ఈ ఏడాది జూన్ నాటికి సాధారణ వర్షపాతం 93.7 మిల్లీమీటర్లు కాగా అదనపు వర్షపాతం113.1 మిల్లీ మీటర్లు నమోదు అయ్యింది. మొత్తం 670 మండలాలలో 502 మండలాలలో అధిక వర్షపాతం నమోదు అయ్యింది. చివరకు వర్షాలు లేక అల్లాడే రాయల సీమ జిల్లాలలో కూడా గత ఏడాదికి మించి అదనపు వర్ష పాతం నమోదు అయింది. సీమ రైతు మొఖం లోనూ జలసిరి కనిపిస్తోంది. సాగు విస్తీర్ణం కూడా గత ఏడాదికి మించి గణణీయంగా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటే ఆహారోత్పత్తి గణనీయంగా సాధించే అవకాశాలు ఉన్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju