AP High Court: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హజరు కావాలంటూ ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీ విచారణకు హజరు కావాలని సీఐడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై నారాయణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇవేళ నారాయణ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా న్యాయమూర్తి ఈ పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు గుంటూరు సీఐడీ కార్యాలయం వరకూ వెళ్లనేననీ, విచారణ అవసరమైతే తనను ఇంటి వద్దనే విచారించేలా సీఐడీకి ఆదేశాలు ఇవ్వాలని నారాయణ హైకోర్టును కోరారు. 65 సంవత్సరాల పైబడిన వారి విషయంలో సుప్రీం కోర్టు నిబంధనలను నారాయణ ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం .. పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ తొలుత మాజీ మంత్రి నారా లోకేష్ కు, ఆ తర్వాత మాజీ మంత్రి నారాయణకు 4వ తేదీన విచారణకు హజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో ఇందరినీ కలిపి సీఐడీ అధికారులు విచారిస్తారేమోనని అనుకున్నారు. అయితే లోకేష్ సీఐడీ విచారణను హైకోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. మరో పక్క నారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు .. ఎందుకంటే..?