జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ముందు .. ఏపీ , తెలంగాణా ఫాన్స్ కూడా పనికిరారు !

Share

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. బాహుబలి ఒక్క తెలుగులోనే కాక వివిధ భాషల్లో రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తో ప్రభాస్ సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది.

Prabhas is making happy to Japan Fans with Saaho - tollywood

ఇక బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత సాహో కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రభాస్ కి అన్ని దేశాల్లో కంటే జపాన్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం ఆశ్చర్య కరం. జపాన్ లో రజినీకాంత్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ స్టార్ డమ్ సాధించుకున్న ఒకే ఒక్క ఇండియన్ హీరో అందులోనూ టాలీవుడ్ నుంచి ప్రభాస్ కావడం విశేషం. బాహుబలి తర్వాత అక్కడ ప్రభాస్ పేరుతో చాలా షాప్స్ కొత్తగా మొదలు పెట్టారు. అంతేకాదు అక్కడ చాలా మంది తమ పిల్లలకి ప్రభాస్ అని పేరు పెట్టడం కూడా ఆశ్చర్యకరం. ఇక కొంతమైందైతే ప్రభాస్ పోస్టర్స్ ని తమ ఇంట్లో పెట్టుకున్నారట. మరికొందరు ప్రభాస్ పేరుని టాటూలుగా వేపించుకున్నారట. ఇలా ప్రభాస్ పై జపాన్ ప్రజలు తమ అభిమానం చూపించుకుంటున్నారు.

Here's the proof of how much fans love Prabhas globally!

ఇంతక ముందు చైనాలో ప్రభాస్ అభిమానులు ఆయన ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మేవారు. కొందరు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ పేర్లతో ఫుడ్ ఐటమ్స్ విక్రయించారు. ఇప్పుడు జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్ గా మారిన ఒక బిజినెస్ మెన్ ప్రభాస్‌ పేరుతో షుగర్‌లెస్‌ మింట్‌ క్యాండీస్‌ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చాడట. ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఆ క్యాండీస్ ని విపరీతంగా కొనుక్కుంటున్నారట. కాగా ప్రభాస్ మీద ఉన్న అభిమానం తోనే తను ఈ క్యాండీస్ కి ఆ పేరు పెట్టానని యజమాని తెలిపాడు.

Adi Purush' के लिए ओम राउत संग जुड़ेंगे ...

ఇక ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల బడ్జెట్ 1000 కోట్లు. రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే ష్యాం చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆ తర్వాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోతున్న ఆదిపురూష్ లో నటించబోతున్నాడు.


Share

Related posts

vaishnav tej – Nagarjuna :అక్కినేని వారి బ్యానర్ లో మెగా మేనల్లుడు..!!

bharani jella

జూనియ‌ర్ ఎన్టీఆర్… టీడీపీ తాజా బ‌క‌రా

sridhar

దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్లి పోతే  ఏమి జరుగుతుందో తెలుసా??

Kumar