Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే చరిత్రను తిరగ రాస్తాయి ట్రెండ్ సెట్టర్ సినిమాలుగా నిలుస్తాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి 2 ది కన్‌క్లూజన్ కూడా అటువంటి సినిమానే. 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన బాహుబలి 2 మూవీ నేటితో విడుదలై ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాహుబలి 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఎపిక్ ఫాంటసీ యాక్షన్ మూవీనే బాహుబలి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ బాహుబలి: ది బిగినింగ్ 2015 జూలై 10వ తేదీన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు బాహుబలి 2 రిలీజ్ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి విలన్ గా చేశాడు. సత్యరాజ్, రమ్య కృష్ణ, నాజర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే అతి పెద్ద ప్రశ్నతో భారీ అంచనాల నడుమ బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది. జాతీయ స్థాయిలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. రాజమౌళి డైరెక్టన్, ప్రభాస్ యాక్టింగ్, రానా విలనిజం, మదర్ సెంటిమెంట్, కీరవాణి మ్యూజిక్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. టాక్ అనుకూలంగా ఉండటంతో బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయింది. ప్రేక్షకులు టిక్కెట్ల కోసం కొట్టుకునేలా చేసింది. 1000 కోట్ల క్లబ్లో ప్రవేశించిన మొదటి భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డు సెట్ చేసింది.
బాహుబలి 2 చిత్రానికి దాదాపు రూ. 350 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. అప్పట్లో ఇంత వస్తుందా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏకంగా రూ.814 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరియు రూ.1800 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రెండో స్థానంలో కూర్చింది. ఇప్పటికీ బాహుబలి 2 స్థానాన్ని మరే సినిమా భర్తీ చేయలేకపోయింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. మరియు తెలుగు చిత్ర పరిశ్రమ స్థితి గతులు మారిపోయాయి. అప్పటివరకు టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన వారంతా బాహుబలి విడుదల తర్వాత జైజైలు పలికారు.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!