Balakrishna : ఈ జానపద చిత్రంలో నటించి తండ్రి ఎన్.టి.ఆర్ ని గుర్తు చేశారు బాలయ్య..ఆ చిత్రం ఏదో తెలుసా..?

Share

Balakrishna : నటనలో తండ్రి నందమూరి తారకరామారావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు నందమూరి బాలకృష్ణ. వెండితెర మీద పవర్ ఫుల్ డైలాగులతో అలరించాలంటే బాలయ్య తర్వాతే. బాలకృష్ణ 14 ఏళ్ళ వయసులో తండ్రి ఎన్.టి.ఆర్ దర్శకత్వంలో 1974 లో వచ్చిన తాతమ్మకల సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభంలో అన్నీ రకాల పాత్రల్లో నటించారు. బాలకృష్ణ హీరో కాకముందు నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించడం విశేషం.

balakrishna-reminded hjis father ntr by this movie
balakrishna-reminded hjis father ntr by this movie

బాలకృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా 1984 లో వచ్చిన సాహసమే జీవితం. ఇదే ఏడాది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య బామ్మగా ప్రముఖ సీనియర్ నటీమణి భానుమతి రామకృష్ణ నటించారు. ఈ సినిమా తర్వాత కథానాయకుడు, ఆత్మబలం, బాబాయి అబ్బాయి, భార్య భర్తల బంధం, భలే తమ్ముడు వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలు బాలకృష్ణ కి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకు వచ్చాయి. ఆయనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని సాధించి పెట్టాయి. బాలయ్య రెమ్యునరేషన్ బాగా పెరిగిన సందర్భం కూడా ఇదేనట.

Balakrishna : చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లతో బాలయ్య కి బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ..!

బాలయ్య నుంచి నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్దారకుడు వచ్చాయి. ఈ సినిమాలలో బాలయ్య పంచెకట్టులోనూ అదరగొట్టారు. సీతారామ కళ్యాణం సినిమాలోని సాంగ్స్ అలాగే ముద్దుల కృష్ణయ్య సినిమాలోని సాంగ్స్ అప్పట్లో మార్మోగిపోయాయి. చక్రవర్తి..కేవి మహదేవన్ లాంటి వారు ఎక్కువగా బాలయ్య సినిమాలకి సంగీతం అందించారు. బాలయ్య కథ విషయంలో ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉండేవారో మ్యూజిక్ పరంగా అంతే కేర్ తీసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లతో బాలయ్య కి బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ నెలకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి.

బాలయ్య సినిమాలు ఎక్కువగా సంక్రాంతి సెంటిమెంట్ ని ఆధారంగా చేసుకొని బాక్సాఫీస్ వద్ద బరిలో దిగేవి. సంక్రాంతి పండుగకి వచ్చిన సినిమాలలో ఎక్కువగా సూపర్ హిట్స్ అందుకున్నారు బాలయ్య. 1984 లో హీరోగా మారిన బాలయ్య 1990 వరకు సంవత్సరానికి కనీసం 6 నుంచి  7 సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో వచ్చిన అపూర్వ సహోదరులు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, భానుమతి గారి మొగుడు, రాముడు భీముడు, ముద్దుల మావయ్య, అశోక చక్రవర్తి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు.

Balakrishna : భైరవ ద్వీపం సినిమాతో తండ్రి ఎన్.టి.ఆర్ ని గుర్తు చేశారు.

నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్ బాలయ్యకి అటు క్లాస్ ఇమేజ్, ఇటు మాస్ ఇమేజ్ ని తెచ్చాయి. బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ చిత్రం ఆదిత్య 369. కొత్త జోనర్ లో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు తెరకెక్కించిన ఈ సినిమా టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది, దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకి కొత్త అనుభూతిని కలిగించింది. ఇక ధర్మ క్షేత్రం, బంగారు బుల్లోడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ లాంటి కమర్షియల్ సినిమాలు చేశారు. బాలయ్య భైరవ ద్వీపం సినిమాతో మరోసారి జానపద చిత్రం లో నటించి తండ్రి ఎన్.టి.ఆర్ ని గుర్తు చేశారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించడం విశేషం.


Share

Related posts

Niharika Konidela : వైరల్ అవుతున్న నిహారిక హోలీ సెలబ్రేషన్స్ పిక్స్..!!

bharani jella

బ్రేకింగ్: మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత

Vihari

బిగ్ బాస్ 4: తన సూట్ కేస్ లో ఎలిమినేషన్ సమయంలో హారిక పెట్టింది ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ తిన్న నోయల్..!!

sekhar