NewsOrbit
న్యూస్

బ్యాంక్‌, పోస్టాఫీస్‌ కస్టమర్లూ.. జాగ్రత్త.. 3 రోజులే అందుకు గడువుంది..!

బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఏదైనా కలిగి ఉన్నారా ? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఆ డిపాజిట్లు కలిగి ఉన్నవారు వెంటనే వాటికి గాను 15జి లేదా 15హెచ్‌ ఫామ్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అవును.. అలా చేయకపోతే మీరు చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై వచ్చే వడ్డీకి టీడీఎస్‌ను కట్‌ చేస్తారు. ఆ తరువాత వచ్చే మొత్తాన్నే మీకు అందిస్తారు.

banks and post office fixed deposit holders you should do this in 3 days

ఇక 15జి, 15హెచ్‌ ఫామ్స్‌ను సమర్పించేందుకు గాను జూలై 7వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఆ లోపు ఎఫ్‌డీలు కలిగి ఉన్న కస్టమర్లు వాటికి సదరు ఫామ్స్‌ను అందజేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీలో నుంచి 10 శాతం టీడీఎస్‌ను కట్‌ చేస్తారు. సాధారణంగా బ్యాంకులు లేదా పోస్టాఫీసులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ మొత్తం నిర్ణీత లిమిట్‌ దాటితే అందులోంచి 10 శాతం టీడీఎస్‌ను కట్‌ చేసుకుంటాయి. అందువల్ల డిపాజిటర్లు ముందుగానే 15జి లేదా 15 హెచ్‌ ఫామ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే సాధారణ పౌరులు 15జి ఫామ్స్‌ను, సీనియర్‌ సిటిజెన్లు 15హెచ్‌ ఫామ్‌ను సమర్పించాలి.

అయితే ఎవరైనా 15జి, 15హెచ్‌ ఫామ్స్‌ను సమర్పించలేకపోతే.. అప్పుడు వడ్డీ నుంచి 10 శాతం టీడీఎస్‌ను కట్‌ చేసినా.. దాన్ని డిపాజిటర్లు మళ్లీ వెనక్కి పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ అందుకు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాలి. అందులో క్లెయిమ్‌ చేసుకుంటే ఎఫ్‌డీ వడ్డీలో కట్‌ అయిన 10 శాతం టీడీఎస్‌ మొత్తాన్ని మళ్లీ వెనక్కి పొందవచ్చు. ఇక ఎస్‌బీఐ కస్టమర్లు అయితే ఆయా ఫామ్స్‌ను సులభంగా సబ్‌మిట్‌ చేయవచ్చు. అందుకు బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన పనిలేదు. ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌లోకి వెళ్లి అందులో ఉండే ఇ-సర్వీసెస్‌ అనే విభాగంలోకి వెళ్తే సరిపోతుంది. అందులో నుంచే నేరుగా 15జి, 15హెచ్ ఫామ్‌లను సబ్‌మిట్‌ చేయవచ్చు.

author avatar
Srikanth A

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju