బిగ్ బాస్ 4: వీడియో చూపించి అభిజిత్ పరువు తీసేసిన నాగార్జున..!!

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితి క్షణక్షణానికి మారిపోతుంది. బయట వాతావరణం మారినట్లు హౌస్ లో కూడా ఎప్పుడు ఏంటి ఎలా జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పరిస్థితి ఇలా ఉండగా వీకెండ్ ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో లో అభిజిత్ పరువు తీసే రీతిలో వీడియో ని ప్లే చేశారు నాగార్జున. మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ 12వ వారం లో అభిజిత్ కి ఇచ్చిన టాస్క్ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు.

Bigg Boss Telugu 4: Host Nagarjuna grills Abhijeet about giving up on a  task; asks Akhil, "Is Monal a friend or more than that?" - Times of Indiaముఖ్యంగా మోనాల్ కి సంబంధించి ఇచ్చిన డేటింగ్ టాస్క్ లో… అభిజిత్… బిగ్ బాస్ పై చేసిన కామెంట్లను ఈవారం వీకెండ్లో నాగార్జున ప్రస్తావించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిజిత్ గతంలో నువ్వు మోనాల్ పైనా చేసిన కామెంట్ ల వలనే… ఆమెను ఏడిపించడం వల్లనే ఈ టాస్క్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మోనాల్ నీ ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఏడిపించ లేదని చెప్పుకొచ్చిన అభిజిత్ కి… అభిజిత్ మోనాల్ తల్లి రాకముందు లాస్య తో అదేవిధంగా హారిక తో కలిసి వేసిన జోకుల వీడియో ప్లే చేసి పరువు తీసేశారు.

 

వీడియో చూసి తనపై అభిజిత్ చేసిన కామెడీ కి మోనాల్ ఒక్క సారిగా షాక్ తింది. దెబ్బకి అభిజిత్ క్షమాపణలు చెప్పాడు. దీంతో వెంటనే సీరియస్ అయ్యిన నాగార్జున ఇలా వివరణ చెబుతూ సారీలు చెప్పడం నీకు బాగా అలవాటు అయిపోయింది అంటూ బిగ్ బాస్ ఇంటి తలుపులను తెరిచే ఈ విధంగా ప్రోమో ఉండటంతో ఈ వారం హౌస్ లో గట్టిగానే అందరికీ డోస్ ఉన్నట్లు నెటిజన్లు బయట చెప్పుకుంటున్నారు.