బిగ్ బాస్ 4: ఓటింగులో టాప్ కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇస్తున్న ఊహించని కంటెస్టెంట్…!!

బిగ్ బాస్ రియాల్టీ షో క్లైమాక్స్ కి చేరుకుంది. ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి తరుణంలో ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు టాప్ ఫైవ్ లోకి వెళ్ళటానికి భారీ స్థాయిలో కృషి చేస్తున్నారు. ఫుల్ ఫోకస్ మైండ్ తో గేమ్ పై దృష్టి పెట్టి… ఫ్రెండ్స్ ని సైతం కూడా పక్కన పెట్టడానికి రెడీ అవుతున్నారు. హౌస్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాకుండా మరో పక్క బిగ్ బాస్… ఇంటి సభ్యులకు ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు.

Bigg Boss 4 Telugu: Monal Gajjar Bagged Highest Votes - Sakshiఇలాంటి తరుణంలో ఆట ఉన్న కొద్ది క్లైమాక్స్ కి వస్తుంటే ఓటింగ్లో ఊహించని కంటెస్టెంట్ కి భారీగా ఓట్లు పడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ముందునుండి మోనాల్ పై బిగ్ బాస్ ఆడియన్స్ కి నెగటివ్ టాక్ ఉంది. హౌస్ లో ప్రతిసారి ఏడుపు మొహం తో గేమ్ ఆడుతోంది అనే టాక్ నడుస్తోంది. పైగా సరిగ్గా భాష మాట్లాడదు అదేవిధంగా ఈమె ఎప్పుడో ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్, కేవలం బిగ్ బాస్ మాత్రమే కాపాడుకుంటూ వస్తున్నారు అనే టాక్ ఎప్పటినుండో సోషల్ మీడియాలో మోనాల్ పై మొన్నటి దాకా రావడం జరిగాయి.

 

అయితే ఎప్పుడైతే 12వ వారం స్టార్ట్ అయిందో దానికి ముందు హారికా నీ కెప్టెన్ చేయటంలో మోనాల్ వ్యవహరించిన తీరు అదే విధంగా నామినేషన్ సమయంలో ఇతర కంటెస్టెంట్ లతో పాయింట్ టు పాయింట్ మోనాల్ మాట్లాడటంతో ఆమెపై బయట ఆడియన్స్ కి ఉన్న నెగిటివిటీ పోయి ఆమెపై మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది అని తాజా పరిస్థితుల బట్టి చెప్పవచ్చు. గతంలో ఓటింగ్ విషయంలో ఎక్కడో మూలన ఉండే మోనాల్, ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ గా ముందు నుండి హౌస్ లో పేరు తెచ్చుకున్న అభిజిత్, అఖిల్ తర్వాత స్థానంలో మోనాల్ ఓట్లు కొల్లగొడుతున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్పుకుంటున్నారు. చాలా హానెస్ట్ గా, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో మోనాల్ కి బాగా అర్థం అయిందని ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో మోనాల్ వెళ్తుందని బయట జనాలు ఆమె ప్రస్తుతం ఆడుతున్న ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ చెప్పుకొస్తున్నారు.