అందమైన శరీరాకృతితో బిగ్ బాస్ సీజన్ 4 లో బ్యూటీ క్వీన్ గా పేరుపొందారు దివి. ఈ బ్యూటీ బిగ్ బాస్ ఇంట్లో హౌస్ మేట్స్ కు గట్టి పోటి ఇచ్చి అందరితో మంచి పేరు సంపాధించుకుని సెలబ్రిటీ అయ్యారు. కాగా ఈమె బిగ్ బాస్ ఇంటినుంచి ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. కాగా ఈ బ్యూటీకి బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాకా సినిమాల్లో చాన్స్ లు వస్తున్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఇంటినుంచి వచ్చేటప్పుడు సమంత హీరో కార్తికేయను సినిమాలో చాన్స్ ఇవ్వమని అడిగిందట. ఇంకేముంది సమంత కోసం హీరో కార్తికేయ దివిని సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. ఇంకేముంది ఈ బ్యూటీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనితో బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాకా దివికి లక్ బానే వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది.
ఇదివరకే ఈ బ్యూటీ మహర్షి సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా నటించింది. దీనితో పాటుగా మరికొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్ చేసి ఇప్పుడు మాత్రం పెద్ద ఆఫర్ ను సొంతం చేసుకోబోతోంది. దీనితో పాటుగా దివి ప్రముఖ నిర్మాణ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రెండు వెబ్ సిరీస్ లో ఈ ముద్దుగుమ్మ అవకాశం దక్కించుకుంది.
దీనితో పాటుగా రెండు చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా నటించేందుకు అవకాశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఏదైతే ఏముంది కాని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి వచ్చిన వారి రూపురేఖలు మొత్తంగా మారిపోతున్నాయి. బిగ్ బాస్ తో బుల్లితెరకే కాకుండా వెండితెరకు కూడా కంటెస్టెంట్లను పరిచయం చేసేస్తుంది బిగ్ బాస్.. చూడాలి మరి ఈ బ్యూటీ తన ప్రతిభను ఎంతవరకు బయటపెడుతుందనేది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!