బిగ్‌బాస్ ఇంటిలో ఎలిమినేషన్ విషయంలో షో నిర్వాహకులపై మొదటి నుండి ఎన్నో విమర్శలు వచ్చాయి. కావాలనే తమకు నచ్చిన కంటెస్టెంట్ ఇంటిలో కొనసాగిస్తూ పక్షపాతం చూపిస్తున్నారు అని అంటున్నారు. అది కాకుండా ఎవరి వల్ల అయితే టిఆర్పి రేటింగ్ లు బాగా వస్తాయో వారినే ఇంటిలో ఎక్కువ రోజులు కొనసాగిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను సైతం ఇంటి బాట పట్టించారు అన్న ఆరోపణలు ఉన్నాయి.
మోనాల్ వంటి కంటెస్టెంట్ 14వ వారం వరకు కొనసాగడం ఏమిటి అన్నది ప్రశ్న. ప్రస్తుతం మిగిలిన 5 కంటెస్టెంట్ లతో పాటు చివరి వరకు వచ్చేందుకు మరో ఇద్దరు ముగ్గురు కూడా అర్హులు అని క్రితం సారి ఎంతోమంది అన్నారు. అయితే తాజాగా షో జరిగే పద్ధతి చూస్తున్న ప్రేక్షకులకు ఇదే అనుమానాలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే సోహెల్, అరియానా మధ్య జరిగిన గొడవలో నాగార్జున దాదాపు సోహెల్ సపోర్ట్ చేశాడు అని అంటున్నారు.
సోహెల్ షో మొదట్లో ఆడవారిపై అరచిన్నప్పుడు అసలు ఊరుకోని నాగార్జున చివరికి అరియానా విషయంలో ఉమెన్ మాత్రం కార్డు వాడింది అని అనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఫైనల్స్ కి వెళ్ళిన రెండవ కంటెస్టెంట్ సోహెల్ అని నిన్న తేలిపోయింది.
దీంతో ఎన్నో విమర్శలు జోరందుకున్నాయి ప్రైవేట్ పోల్స్ లో ఓట్ల శాతం చూస్తే సోహెల్ కు చాలా తక్కువ ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. అది కాకుండా అభిజిత్ కంటే కూడా సోహెల్ కు కచ్చితంగా తక్కువ ఓట్లు ఉంటాయి. అయితే ఫైనల్స్‌కు చేరిన రెండవ కంటెస్టెంట్ సోహెల్ అని ప్రకటించడం వెనుక అంతరార్థం అరియానా పైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అని ఆమె ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇక అదే నిజమైతే దాదాపు అభిజిత్, సోహెల్ మధ్యనే టైటిల్ ఉంటుంది అని భావిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!