బిగ్బాస్ ఇంటిలో ప్రతి ఎపిసోడ్ కు పరిస్థితులు మారిపోతాయి. ప్రేక్షకులు ఒకరోజు ఒక వైపు మొగ్గు చూపితే మరొక రోజు అదే వ్యక్తిని తీవ్రంగా విమర్శిస్తారు. బిగ్ బాస్ కూడా ఇంటిలోని పరిస్థితులను అలా మార్చేస్తాడు. ప్రస్తుతం ఎవరి ఓపిక ఎంతవరకు ఉంది ఎవరు తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలుగుతారో వారే ఫైనల్స్ వరకు వెళ్ళగలరు.
ఇలాంటి సమయంలో నిన్న ఇచ్చిన టాస్క్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ దొరికిపోయారు. మామూలుగా సోహెల్, అరియానా ఇద్దరూ టైటిల్ కొట్టగల సత్తా ఉన్న కంటెస్టెంట్స్. అయితే నిన్న టాస్క్ లో అరియానా పట్టు కోల్పోయి కోపం తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో సోహెల్ కావాలని ఆమెకు ప్రీతిపాత్రమైన వస్తువులను పాడుచేయడం గమనించవచ్చు. ఆమెకు పీక్స్ లో చిరాకు తెప్పించేందుకు అతను బాగా ప్రయత్నించాడు
ఇది అరియానా ఫ్యాన్స్ తో పాటు చాలా మందికి కోపం తెప్పించింది. ఒక మనిషిని ఇంతలా వేధించడం కరెక్ట్ కాదని అన్నారు .అయితే మరి కొందరు మాత్రం ఇది టాస్క్ లో భాగమే అని వాదిస్తున్నారు. తన సమయం పూర్తయిన తర్వాత బయటకు వచ్చినా అరియానా సోహేల్ తో భారీ వాదనకు దిగింది. నా పైన నీకు ఇంత కక్ష ఉంది అని తెలిస్తే ముందే చెప్పాల్సింది అంటూ కడిగి పారేస్తుంది.
ఇక దానికి సోహెల్ నువ్వు వస్తువులు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వు అని అంటాడు అప్పుడు అరియానా గట్టి గట్టిగా అరుస్తూ సోహెల్ ను ‘రా’ అని సంబోధిస్తూ ఉంది. ఇలా అరియానా కోపం, బాధ కూడా కొద్ది మందికి ఓవరాక్షన్ లాగా అనిపించింది. ఇక వీరిద్దరూ ఒక్కసారిగా ఇలా ప్రవర్తించడంతో ప్రేక్షకుల దృష్టిలో చాలావరకు బాడ్ అయ్యారనే చెప్పాలి. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరే ఫైనల్స్ చేరుకుంటారు అని అంచనా వేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!