టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సరిగ్గా రెండు వారాల క్రితం వారు మహేష్ బాబు బర్తడే కామన్ డిపి ని విడుదల సందర్భంగా ఆ హ్యాష్ టాగ్ ను 24 గంటల్లో ఏకంగా 3.1 కోట్ల ట్వీట్స్ చేసి జాతీయ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
ఇక రేపు మహేష్ పుట్టినరోజు సందర్భంగా సందడి మళ్లీ అదే రీతిలో కనిపిస్తుంది. బర్త్ డే కు ముందు రోజు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ బర్త్ డే ట్రెండ్ మొదలైంది. బర్త్ డే ట్రెండ్ మొదలెఱ్ట్టిన తొమ్మిది నిమిషాల్లో 1 మిలియన్ ట్వీట్స్, 20 నిమిషాల్లో రెండు మిలియన్లు, గంటన్నరలో 10 మిలియన్ల ట్వీట్స్ సాధించి ఫ్యాన్స్ రికార్డు బద్దలు కొట్టారు.
అసలు ఇలా జాతీయ రికార్డుని ట్వీట్స్ ద్వారా నెలకొల్పడం అనేది ముందు ఎన్టీఆర్ అభిమానులతో మొదలైంది. మొన్ననే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు టైగర్ ఫ్యాన్స్ రికార్డు కాస్తా పవర్ స్టార్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారు. ఇక మహేష్ ఫ్యాన్స్ పెద్దగా టైం తీసుకోకుండా తమ సత్తా ఏమిటో చూపించారు.
ఇప్పుడు మళ్లీ రెండోసారి వారి రికార్డును వారే బద్దలు కొట్టుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆలిండియా రికార్డు కూడా మహేష్ పేరిటే ఉంది. రేపు సాయంత్రం వరకు ఏ స్థాయిలో వీరు ట్వీట్ల రికార్డుని పెడతారా అని టాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దాదాపు 3.5 నుండి నాలుగు కోట్ల వరకు ట్వీట్స్ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక త్వరలో రాబోయే పవన్ కళ్యాణ్ బర్త్ డే కు కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద టార్గెట్ ను ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.