Breaking: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు మందుబాబులు షాక్ ఇస్తుంటారు. వెకిలి చేష్టలు చేస్తూ పోలీసుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఇవన్నీ అడపాదడపా జరిగే సాధారణ ఇబ్బందిలే కానీ తాజాగా ఇద్దరు మందుబాబులు బ్రీత్ ఎనలైజర్ మెషిన్ ని పోలీసుల చేతుల్లోంచి లాక్కొని పరారయ్యారు.
BREAKING: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా వైసీపీ..!
కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సింహారావు నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. సరిగ్గా 11.45 సమయంలో మియాపూర్ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులను బైకుపై వచ్చారు. వారిని ఆపిన హోంగార్డు శ్వాసను పరీక్ష చేసేందుకు నోటి దగ్గర బ్రీత్ ఎనలైజర్‌ను పెట్టాడు. అయితే ఒక మందు బాబు నోటికి దగ్గరగా పెట్టిన బ్రీత్ ఎనలైజర్‌ను లాక్కొని క్షణాల్లోనే అక్కడినుంచి ఉడాయించాడు. దాంతో షాకయిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ మందు బాబులను పట్టుకుని పనిలో పడ్డారు పోలీసులు.
BREAKING: గాంధీ జయంతి రోజున శ్రమదానం చేయనున్న జనసేన పార్టీ..!