న్యూస్ ప్ర‌పంచం

Breaking: శ్రీలంక కోర్టు కీలక ఆదేశాలు – మాజీ ప్రధాని మహింద రాజపక్స అరెస్టుకు రంగం సిద్దం

Share

Breaking: శ్రీలంక దేశ రాజధాని కొలంబో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు సహా 12 మంది మద్దతుదారులు దేశం విడిచి వెళ్లడానికి వీలులేదంటూ ఇటీవల ట్రావెల్ బ్యాన్ విధించిన కోర్టు తాజాగా మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. మహింద రాజపక్స తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని సీఐడీని కోర్టుకు ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసన కారులపై దాడులు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహింద రాజపక్స అరెస్టునకు రంగం సిద్దం అయ్యింది.

Breaking Sri Lanka Court key orders
Breaking Sri Lanka Court key orders

Breaking: తక్షణం అరెస్టు చేయాలని కోర్టులో పిటిషన్

దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రధాని నివాసం వద్ద దాడులు జరిగినట్లు అటార్నీ సెనక పెరీరా అనే వ్యక్తి కొలంబో మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహింద మద్దతుదారులే ఈ దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. దీనిపై మహింద రాజపక్సతో పాటు పార్లమెంట్ సభ్యులు జాన్స్ టన్ ఫెర్నాండో, సంజీవ ఎదిరిమన్నె, సనత్ నిశాంత, మొరాటువా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ సమన్ లాల్ ఫెర్నాండో, సీనియర్ పోలీస్ అధికారులు దేశబందు తెన్నకూన్, చందనా విక్రమరత్న ను తక్షణం అరెస్టు చేయాలని పిటిషన్ లో కోరారు.

తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో 9 మంది మృతి చెందగాా వందలాది మంది గాయపడ్డారు. ఆస్తులు ధ్వంసం అయ్యాయి. గొటబయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


Share

Related posts

Nara Lokesh: టీడీపీకి వాళ్లే పెద్ద మైనస్..!? లోకేష్ టీమ్ పై అనేక ఆరోపణలు..!?

Srinivas Manem

Mahesh Babu: తండ్రి పుట్టిన రోజు నాడు అభిమానులు కాలర్ ఎగరేసే పనిచేసిన మహేష్ బాబు..!!

sekhar

RRR: RRR ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సూపర్ గుడ్ న్యూస్

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar