NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ఈ లీడ‌ర్లు త‌డిగుడ్డేసుకుని ప‌డుకోవ‌చ్చా… చంద్ర‌బాబే గెలిపించేస్తారా..!

పార్టీ ఏదైనా.. కొంద‌రు నాయ‌కుల‌కు క‌లిసి వ‌చ్చింది. వారంతా త‌డిగుడ్డేసుకుని ప‌డుకున్నా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేత‌లే.. త‌మ‌ను తాము అభ్య‌ర్థులుగా నిర్ణ‌యించుకుని ముందుకు సాగుతు న్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ పొందిన వారికంటే. కూడా పార్టీల అధినేత‌లే ఎక్కువ‌గా మ‌ధ‌న ప‌డుతున్నారు. ప్ర‌చారానికి శ్రీకారం చుడుతున్నారు.

ఏ ఎన్నిక‌లైనా.. అభ్య‌ర్థుల‌కు క‌త్తిమీద సామే. అభివృద్ది చేశామ‌ని, అభివృద్ధి చేస్తామ‌ని చెబుతున్నపార్టీ ఒక‌వైపు. ఇప్ప‌టి వ‌ర‌కు వేల కోట్లు సంక్షేమం రూపంలో అందించామ‌ని చెబుతున్న పార్టీ మ‌రోవైపు. ఈ రెండు పార్టీల మ‌ధ్యే పోరు ఘోరంగా సాగ‌నుంది. దీంతో అభ్య‌ర్థులు చ‌మ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే.. ఇది 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాదు. ఎందుకంటే.. అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా పార్టీల గెలుపును అధినేత‌లే ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. పుంగ‌నూరు, మంగ‌ళ‌గిరి, క‌డ‌ప‌, పులివెందుల‌, టెక్క‌లి, పిఠాపురం, హిందూపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చిల‌క‌లూరిపేట‌, పెద్దకూర‌పాడు, న‌ర‌స‌రావుపేట‌, మ‌చిలీప‌ట్నం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, తాడికొండ‌, స‌ర్వేప‌ల్లి, నెల్లూరు రూర‌ల్‌, ఉద‌య‌గిరి, కుప్పం, ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి, విశాఖ ఎంపీ.. ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాలు ఇరు పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్నాయి.

ఇక్క‌డ వైసీపీ గెలిచి తీరాల‌ని.. టీడీపీకి చుక్క‌లు చూపించాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో ఆయ‌నే స్వ‌యంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక్క‌డ షెడ్యూల్ ప్ర‌కారం.. ఒక రోజు కాకుండా.. మూడు రోజులు ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఇక‌, టీడీపీ వైపు కూడా ఇంతే ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు ఉన్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ సత్తా నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌న కూడా చూస్తున్నారు.

దీంతో స్వ‌యంగా బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ సేపు కేటాయించి.. ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో ఇక్క‌డి అభ్య‌ర్థులు చేసుకునే ప్ర‌చారం క‌న్నా.. అధినేత ప్ర‌చారానికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీంతో వారు ఎలా ప్ర‌చారం చేసుకున్నా.. అధినేత‌లే సీరియ‌స్‌గా తీసుకున్న నేప‌థ్యంలో త‌మ‌కు దిగుల్లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju