NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విడ‌ద‌ల ర‌జ‌నీపై మాధ‌వి అస్త్రం వేస్తోన్న చంద్ర‌బాబు.. రెండు బ‌ల‌మైన ఈక్వేష‌న్ల‌తో జ‌గ‌న్‌కు చెక్‌..!

గుంటూరు ప‌శ్చిమ రాజ‌కీయంలో జ‌గ‌న్ వేసిన విడ‌ద‌ల ర‌జ‌నీ అస్త్రానికి చంద్ర‌బాబు అదిరిపోయే పైఎత్తుతో చెక్ పెట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న ర‌జ‌నీని అక్క‌డ నుంచి గుంటూరు వెస్ట్‌కు మార్చేశారు. ర‌జ‌నీ ప్ర‌చారం ప్రారంభించేశారు. ర‌జ‌నీపై టీడీపీ నుంచి ఎవ‌రిని పోటీకి దింపాలా ? అని ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు చేసిన చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు రెండు బ‌ల‌మైన ఈక్వేష‌న్ల‌తో జ‌గ‌న్ ఎత్తుకు పై ఎత్తు వేసేశారు. ర‌జ‌నీపై చంద్ర‌బాబు వ‌దిలిన ఆ అస్త్ర‌మే గ‌ల్లా మాధ‌వి.

గుంటూరు వికాస్ హాస్ప‌ట‌ల్స్ డైరెక్ట‌ర్ అయిన మాధ‌వి బీసీల్లో ర‌జ‌క సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. విడ‌ద‌ల ర‌జనీ బీసీ + మ‌హిళా కోటాలో ఇక్క‌డ ఉంటే చంద్ర‌బాబు జ‌గ‌న్ ఎత్తును చిత్తు చేస్తూ అంతే ధీటుగా బీసీ + మ‌హిళా కోటాలో గ‌ల్లా మాధ‌విని రంగంలోకి దించుతున్నారు. మాధ‌వి ఇటు వైద్య రంగంలో ఎంతోమంది నిరుపేద‌ల‌కు సేవ‌లు అందిస్తూ.. అటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇక గుంటూరు వెస్ట్ సీటును గ‌తంలో కూడా టీడీపీ మ‌హిళ‌కు కేటాయించింది. మాజీ మంత్రి శ‌న‌క్కాయ‌ల అరుణ ఇక్క‌డ నుంచే గెలిచి మంత్రి అయ్యారు.

మాధ‌వికి చంద్ర‌బాబు సీటు ఇస్తే వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు ఈక్వేష‌న్ చాలా సులువు అవుతుంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న బీసీ వ‌ర్గాల‌న్ని మాధ‌వి వెంటే ఉంటాయ‌న‌డంలో డౌట్ లేదు. ర‌జ‌నీ నియోజ‌క‌వ‌ర్గానికి నాన్‌లోక‌ల్. వెస్ట్ సీటు మామూలుగానే టీడీపీకి కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ పార్టీ మంచి మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు బీసీ మ‌హిళ‌ను రంగంలోకి దించితే మ‌హిళలు + బీసీ + క‌మ్మ + కాపు + వైశ్య సామాజిక వ‌ర్గాలు అన్నీ వ‌న్‌సైడ్‌గా టీడీపీకి వెన్నుద‌న్నుగా నిల‌వ‌నున్నాయి. దీనికి తోడు రాజ‌ధాని ఎఫెక్ట్ గుంటూరు న‌గ‌రంపై ఏ స్థాయిలో ఉందో చెప్ప‌క్క‌ర్లేదు.

మాధ‌వి చ‌రిత్ర సృష్టిస్తుందా…
బీసీల్లో ఎన్నో వెన‌క‌ప‌డిన వ‌ర్గాల‌ను రాజ‌కీయంగా పైకి తీసుకొచ్చి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిన ఘ‌న‌త టీడీపీదే. బీసీల్లో ఎంతో వెన‌క‌ప‌డిన ర‌జ‌క కులానికి చెందిన దువ్వార‌పు రామారావును ఎమ్మెల్సీని చేసి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపి చంద్రబాబు చ‌రిత్రే సృష్టించారు. మ‌ళ్లీ ఇప్పుడు అదే ర‌జ‌క కులానికి చెందిన మ‌హిళ‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఏపీ రాజ‌కీయాల్లోనే ఓ సెన్షేష‌న్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ర‌జ‌క క‌మ్యూనిటీలో టీడీపీకి ఎంతో ప్ల‌స్ అవ్వ‌నుంది. మాధ‌వికి సీటు ఇస్తే ర‌జ‌క మ‌హిళా ఎమ్మెల్యే అయ్యే ల‌క్కీ ఛాన్స్ ఆమెకు వ‌చ్చిన‌ట్టే..!

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju