Balakrishna Prabhas: నటసింహం నందమూరి బాలయ్య బాబుతో చాలామంది దర్శకులు పనిచేశారు. అయితే ఆయనతో తీసిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఏకైక దర్శకుడు బోయపాటి శ్రీను. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో వరుసపరాజయాలలో ఉన్న బాలయ్య బాబుకి “సింహా” సినిమాతో మర్చిపోలేని హిట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అనంతరం లెజెండ్, అఖండ వంటి సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. డైరెక్టర్ బోయపాటి చాలా అద్భుతంగా బాలయ్యని తెరమీద చూపిస్తారు. ఇదే విషయాన్ని నందమూరి ఫ్యాన్స్ చెబుతుంటారు. బాలకృష్ణ కి బోయపాటి ఎంతో లక్కీ డైరెక్టర్.
అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేయటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. కల్కి తో పాటు మరోపక్క రాజా సాబ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ సీక్వెల్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రేమ కథ చిత్రం ఇలా ప్రాజెక్టులు వరుసగా పెట్టుకున్నారు. ఈ సినిమాలు అయినా తర్వాత బోయపాటితో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు అనంతరం అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయబోతున్నారట. ఆ తర్వాత బాలకృష్ణతో “అఖండ” సీక్వెల్ తీయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు ప్రభాస్ తో బోయపాటి సినిమా చేయనున్నట్లు సమాచారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోలను చాలా పవర్ ఫుల్ గా చూపించడంలో బోయపాటి స్టైలే వేరు. ఎక్కువగా ఆయన సినిమాలు మాస్ ఆడియోన్స్ కి నచ్చుతాయి. దీంతో మాస్ లో ఎంతో ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో.. బోయపాటి సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది