Chiranjeevi: ప్రస్తుతం వచ్చిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద బడ్జెట్‌కి సమానంగా కూడా కలెక్షన్లు అందుకోలేకపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న కూడా దాని కలెక్షన్స్ ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ అనేవి మొదటిరోజుతో పోలిస్తే చాలా తక్కువకు పడిపోయాయి. వర్షాల కారణంగా కూడా ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి. ఇక వర్షాలు పోయి గాడ్ ఫాదర్ సినిమా వసూళ్లు కాస్త మెరుగుపడుతున్న పరిస్థితులలో అల్లు అరవింద్ చిరుకి పోటీగా వచ్చాడు.
Chiranjeevi: కాంతారతో చిరు కలెక్షన్స్‌పై ఎఫెక్ట్

కన్నడ భాషలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘కాంతార‘ సినిమాని అల్లు అరవింద్ తెలుగులో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దాంతో గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్స్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చింది. అధికంగా వసూళ్లు వస్తున్నాయని సంబరపడేలోగా కాంతార సినిమా వచ్చి గాడ్ ఫాదర్ సినిమాని తొక్కి పడేసింది. కాంతార సినిమా కాన్సెప్ట్ బాగుండటంతో రోజు రోజుకీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కాంతార సినిమా ఇప్పటికే 8 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రిషభ్ శెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతోపాటు హీరోగా నటించాడు. అతని నటనకు, డైరెక్షన్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
వాటి పరిస్థితేంటి

కాంతార క్లైమాక్స్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమా చూడటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. నెక్స్ట్ వీకెండ్ లోగా ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసే అవకాశముంది. మరి నెక్స్ట్ వీక్ వచ్చే సినిమాలు కాంతార సినిమాకి పోటీగా నిలుస్తాయా.. లేకపోతే గాడ్ ఫాదర్ వలె చతికిలా పడతాయా అనేది చూడాలి.