Chiranjeevi : చిరంజీవి యూనివర్సల్ డైరెక్టర్ శంకర్ సినిమా అంటే ఎలాంటి అంచనాలుంటాయో ఊహించడమే చాలా కష్టం. కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ తో రోబో తీసి శంకర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అంతక ముందు నుంచే శంకర్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందంటూ చాలాసార్లు వార్తలు వచ్చాయి. మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేమికులు అదే ఆశ పడ్డారు. కాని ఎందుకనో మూడు, నాలుగు సార్లు భారీ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేసి కూడా అది వర్కౌట్ కాలేదు. ఇక రోబో ఫంక్షన్ లో స్వయంగా రజనీకాంత్ కూడా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయమని చిరంజీవి కి చెప్పాడు.
దాంతో ఖచ్చితంగా ఈ కాంబో సెట్ అవుతుందనే అనుకున్నారు. కాని చిరంజీవి 10 ఏళ్ళు సినిమాలకి దూరంగా ఉండటం తో పాటు ఇతర కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే గత ఏడాదిగా శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. కాని అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు కారణం కమల్ హాసన్ తో శంకర్ ఆల్రెడీ ఇండియన్ సినిమా కమిటవడమే. కాని శంకర్ కి నిర్మాతలకి మధ్య క్రియేటివ్ డిఫ్రెన్స్ రావడం తో శంకర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
Chiranjeevi : ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు లైన్ లో పెట్టారు.
ఆ తర్వాత ఎలాగైనా టాలీవుడ్ లో సినిమా చేయాలని శంకర్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పటి నుంచో శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు లైన్ లో పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనున్స్ చేశారు. అయితే శంకర్ తో చిరంజీవి సినిమా చేయలేకపోయినప్పటిని రామ్ చరణ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ స్వయంగా చిరంజీవి వెల్లడించారు. కాగా ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!