Kajal agarwal : లక్ష్మీ కళ్యాణం సినిమాలో ఎంతో అమాయకంగా నటిస్తూ వెండితెరపై అడుగుపెట్టిన ఈ చందమామ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతూ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలబడ్డారు. ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి పెళ్లి తర్వాత ఒకవైపు వ్యాపార రంగంలోనూ, మరోవైపు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా కాజల్ అగర్వాల్ సినిమాలలో నటిస్తూ “లైవ్ టెలికాస్ట్”అనే సిరీస్ ద్వారా వెబ్ లోకి అడుగు పెడుతున్నారు. లైవ్ టెలికాస్ట్ ప్రమోషన్లో భాగంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ సిరీస్ లో తను ఓ టీవీ షోస్ డైరెక్టర్ పాత్రలో చేశాను. సాధారణంగా నటులకు ఆ రోజు షూటింగ్ లో పాల్గొంటే అంతటితో వారి పని అయిపోతుంది. కానీ షూటింగ్ తర్వాత దర్శకుల పని ఎంత కష్టంగా ఉంటుందో ఈ సిరీస్ లో ఈ పాత్రలో నటించడం వల్ల వారి కష్టం తెలుస్తోంది అంటూ కాజల్ అగర్వాల్ తెలియజేశారు.
కాజల్ కు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఏకంగా సినిమాల లిస్ట్ చెప్పాలనిపిస్తుందట:
ఈ ప్రమోషన్ లో భాగంగానే కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలామంది తనను పెళ్లవగానే నటనకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నను పదే పదే అడుగుతున్నారని తెలిపారు. పెళ్లి అయితే పని చేసుకోకూడదా? వృత్తి వేరు… వ్యక్తిగత జీవితం వేరు. వృత్తికి, పెళ్లికి సంబంధం ఏమిటి? ఆ విధంగా ప్రశ్నలడుగుతుంటారని,ఆ విధంగా అడిగినప్పుడు తను చేయబోయే సినిమాల లిస్ట్ గురించి చెప్పాలనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ తెలియజేశారు.ఇక సినిమాల విషయానికొస్తే కాజల్ తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు, అదేవిధంగా భారతీయుడు 2, మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది కాజల్ అగర్వాల్ నటించిన దాదాపు నాలుగైదు సినిమాలు విడుదల కానున్నట్లు తెలిపారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!