NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా సెకండ్ వేవ్ వచ్చింది – ముఖ్యమంత్రి వార్నింగ్ తో ఉలిక్కిపడ్డ రాష్ట్రం !

వారం కింద‌టే.. ఓ గుడ్ న్యూస్ మ‌నం విన్నాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న దేశంలో ఉగ్ర‌రూపం త‌గ్గించింద‌నేది స‌ద‌రు వార్త‌.

సెప్టెంబ‌ర్ 22నాటి స‌మాచారం ప్ర‌కారం, గత కొద్దిరోజులుగా లక్షకు చేరువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుమొఖం పట్టాయి. సెప్టెంబ‌ర్ 21 నాటికి 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,33,185 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొత్తంగా 75,083 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడిచిన మూడు వారాల్లో 76వేల కంటే తక్కువ కేసులు నమోదుకావడం అదే తొలిసారి. అయితే తాజాగా ఓ షాకింగ్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. అది కూడా దేశంలో పెద్ద ఎత్తున కేసులు న‌మోదు అవుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డే ఇంకో షాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

మ‌హారా‌ష్ట్రలో ఏం జ‌రుగుతోందంటే…

మ‌హారాష్ట్రలో క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఆ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గ‌డం లేదు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 123,21,176 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 10,16,450 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కోలుకోగా.. ప్రస్తుతం 2,69,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 35,191కి చేరింది. ఇలాంటి త‌రుణంలో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ కోవిడ్-19 వేవ్ తలెత్తవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు దేశంలోనే అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్ర ‌ముఖ్య‌మంత్రి ఇంత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో క‌రోనా విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

సీఎం ఘాటు వ్యాఖ్య‌లు

క‌రోనా వ్యాధి పెర‌గ‌డానికి కొంద‌రు కార‌ణం అవుతున్నార‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక్రే మండిప‌డ్డారు. ఎలాంటి రోగ ల‌క్షణాలు లేని రిని ఇళ్లలోనే ఉండేందుకు అనుమతించినప్పటికీ వారు పట్టించుకోకుండా బయట సంచ‌రిస్తూ కరోనా ఇన్ఫెక్షన్ సోకడానికి కారకులు అవుతున్నారని మండిప‌డ్డారు. వీరివల్ల కరోనా వైరస్ వ్యాపిస్తోందన్నారు. వీళ్ళు ఏ విధమైన ప్రికాషన్స్ పాటించకుండా తిరుగుతున్నారని, ఫలితంగా ఆరోగ్యవంతులు కూడా ఈ వైరస్ కి గురవుతున్నారని మ‌హారాష్ట్ర సీఎం అన్నారు. ‘నా కుటుంబం, నా బాధ్యత’ అన్న కాన్సెప్ట్ ప్రతి వ్యక్తిలో కలగాలి అని ఆయన సూచించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్స్, పెరగాలని, ఇందుకు తాము చర్యలు తీసుకుంటామని మ‌హారాష్ట్ర సీఎం భ‌రోసా ఇచ్చారు.

పోలీసుల్లో కొత్త టెన్ష‌న్

మ‌రోవైపు మరాఠా పోలీసును కరోనా మహమ్మారి వదలడం లేదు. రోజు రోజుకు వందకుపైగా సిబ్బంది వైరస్‌ బారినపడుతున్నారు. గడిచిన 24గంటల్లో మరో 169 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. తాజాగా మరో ఇద్దరు సిబ్బంది మరణించారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 22,629 మంది సిబ్బందికి మహమ్మారి సోకింది. ఇందులో 19,198 మంది కోలుకోగా.. 3190 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకు సుమారు 241 మంది సిబ్బంది మృత్యువాతపడ్డారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N