NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Cm Kcr: కేసీఆర్ సాబ్.. ఇట్లైతే ఎలా? మాస్క్ ధరించుడు గట్లేనా..!?

criticism on cm kcr

Cm Kcr: కేసీఆర్ Cm Kcr తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమం నాటి నుంచీ.. అధికారం చేపట్టిన తర్వాత.. ఇప్పుడు కూడా ఆయన తీరు భిన్నమే.  ఇటివలే కేసీఆర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. పరీక్షల్లో పూర్గిగా ఫిట్ అయ్యాక నిన్న ప్రగతి భవన్ కు చేరుకుని కరోనా, వ్యాక్సనేషన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖానికి మాస్కు పెట్టుకున్నారు. కానీ.. ఆయన మాస్కు ధరించిన విధానమే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సమీక్షలో సీఎస్ సహా ఉన్నతహోదాలో ఉన్న అధికారులు 14 మంది వరకూ హాజరయ్యారు. అందరూ మాస్కులు ధరించారు. కేసీఆర్ కూడా ధరించారు. కానీ.. ముక్కు, నోటి కిందకు మాస్కు ధరించి ఉన్నారు.

criticism on cm kcr
criticism on cm kcr

ప్రస్తుతం మాస్కు విధిగా ధరించాల్సిన పరిస్థితి. అందులోనూ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ.. ఆ ఫొటోలో సీఎం అలా లేరు. సమీక్ష ఆద్యంతం ఇలానే ఉన్నారో.. లేక కాసేపు అలా మాస్కు నోటి కిందకు ధరించారో కానీ.. ఈ ఫొటోనే కొన్ని పత్రికల్లో వచ్చింది. అసలే.. కరోనా నుంచి కోలుకుని వచ్చారు. ప్రజలకు చేయాల్సిన సూచనలు, చెప్పాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహిస్తున్న సమీక్షలో సాక్షాత్తూ సీఎం ఇలా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాగర్ ఉప ఎన్నికల ప్రచార సభలో, పార్టీ సమావేశంలో మాస్కు లేకుండానే కనిపించారు. ఆ తర్వాతే ఆయనకు కరోనా వచ్చింది. ఇప్పుడు కోలుకున్నారు.

కరోనా నుంచి కోలుకున్న ఎవరిలోనైనా.. ఆ వైరస్ శరీరం నుంచి పూర్తిగా వెళ్లిందని చెప్పలేం. దీంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలినేది తెలిసిన విషయమే. దీని వలన చుట్టుపక్కల వారూ సేఫ్ ఫీల్ అవుతారు.  గతేడాది కరోనాపై అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతాయి. ఓపక్క హైకోర్టు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. మరోపక్క తనయుడు కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఓపక్క మాస్కులు విధిగా ధరించాలి.. రెండు మాస్కులు ధరించాలి.. అని ప్రభుత్వమే చెప్తుంటే సీఎం సాబ్ ఇలా మాస్క్ నోటి కింద పెట్టుకున్నట్టుగా కనిపించడం విడ్డూరమే. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N