Cryptocurrency: మీరు క్రిప్టోకరెన్సీ ప్రియులా? వాట్సాప్ మీకోసమే ఈ ఫీచర్ జోడిస్తోంది!

Share

WhatsApp: ఇంచుమించు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్స్ వున్నారు. స్మార్ట్ ఫోన్ వున్న ప్రతీ ఒక్కరూ ముందుగా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటారు. దీని తరువాతే మిగతా యాప్స్ అనే మాదిరిగా మార్కెట్ సంపాదించుకుంది ఈ యాప్. దీనికి కారణం అందరికీ తెలిసినదే. అయితే యూజర్స్ వినియోగానికి తగ్గట్టు వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తోంది. ఈ మధ్యనే వాట్సాప్ ద్వారా డబ్బులు చెల్లించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు దీనిలోనే మరో అప్షన్ ను కూడా జోడించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్న ఇతర బడా సంస్థలు ఇవే!

ప్రస్తుతం మార్కెట్ లో క్రిప్టోకరెన్సీ ఫీవర్ నడుస్తోంది. అయితే ఈ కరెన్సీ పై పలు అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు భారీగానే పెడుతుండటం మనం గమనించవచ్చు. యాపిల్ ఇంకా ఎలన్ మస్క్ కంపెనీలు క్రిప్టో కరెన్సీలో భారీ పెట్టుబడులు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇపుడు ఆ వరుసలో వాట్సాప్ కూడా చేరిపోతోంది. మార్కెట్ కి అనుగుణంగా మారుతూ పలు విషయాల్లో వాట్సాప్ ముందుగానే ప్రవేశిస్తోంది.

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుందా?

నోవి పేరుతో పైలెట్ ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ నోవి బీటా వెర్షన్స్ అందిస్తుంది. నోవిలో అవసరమైన సమాచారాన్ని ఇచ్చిన తర్వాత వాలెట్ లో కరెన్సీని ఉంచాలి. తరువాత ఈ కరెన్సీని మెటా డిజిటల్ కరెన్సీగా మార్చుతుంది. తరువాత ఆ కరెన్సీని క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లిస్తుంది. నోవి డిజిటల్ క్రిప్టో కరెన్సీ వెర్షన్ విషయంలో యూజర్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెబుతున్నారు. ఇక చూడాలి మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో!


Share

Related posts

Samantha : కరెక్ట్ పాయింట్ లో దొరికిందిగా .. సమంతని ఒక రేంజ్ లో ట్రాల్ చేస్తోన్న నాగార్జున, నాగ చైతన్య ఫ్యాన్స్ !

Ram

ముంబై ఎయిర్ పోర్టులో పాండ్యా

Siva Prasad

ఎమ్మెల్సీ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిన టిడిపి! అది ఎలాగంటే ?

Yandamuri