Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’. పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగాన్ని ‘పుష్ప: ది రైజ్’ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ను చిత్ర బృందం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఆగస్ట్ 13న ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.

ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇదే వరుసలో తాజాగా ఈ సాంగ్ ప్రోమోను వదిలింది చిత్ర బృందం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను ఐదు సౌత్ భాషల్లోని ఐదుగురు ఫేమస్ సింగర్స్ పాడటం విశేషం. ఇక ఇప్పటికే ఈ పాట తమిళం, హిందీ, కన్నడ, మలయాళ, వెర్షన్స్ కు సంబంధించిన ప్రోమోలను మేకర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు వెర్షన్ ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ ప్రోమోని సుకుమార్ బృందం రిలీజ్ చేసింది. ఈ ప్రోమో సాంగ్ ఉంది జస్ట్ 11 సెకన్లే అయినా ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు.
Pushpa : పుష్ప సినిమా మ్యూజిక్ ఎంతో ఛాలెంజ్ తో కూడుకున్నది.
‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ సాగే సాంగ్ బిట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చిన్న సాంగ్ బిట్ ఇలా ఉంటే ఇక పూర్తి స్థాయిలో మొత్తం సాంగ్ రిలీజ్ అయితే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఆమెతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రాక్ స్టార్ కి పుష్ప సినిమా మ్యూజిక్ ఎంతో ఛాలెంజ్ తో కూడుకున్నది. గత కొంతకాలంగా ఆయన ఫాం లో లేడు. మళ్ళీ పుష్పతో తన సత్తా చాటనున్నాడని సుకుమార్ బృందం చాలా నమ్మకంగా ఉంది. చూడాలి మరి ఎలాంటి ఆల్బం ఇవ్వబోతున్నాడో.
#PushpaFirstSingle promo from #PushpaTheRise ?
Full Song will stun you from AUG 13 ?
A Rockstar @ThisIsDSP Musical ?#DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke #JaagoJaagoBakre@alluarjun @iamRashmika @aryasukkuPlaylist – https://t.co/8gQbTBxmn3 pic.twitter.com/LNvFLcB3GA
— Mythri Movie Makers (@MythriOfficial) August 11, 2021