నాగార్జున నటించిన మన్మధుడు 2 తో ఫ్లాప్ అందుకున్న రకుల్ ఇక టాలీవుడ్ లో కెరీర్ క్లోజ్ అని అందరూ భావించారు. కాని రకుల్ కెరీర్ యూ టర్న్ తీసుకుంది. వరసగా బడా నిర్మాణ సంస్థలలో స్టార్ డైరెక్టర్స్ తో పని చేస్తోంది. మళ్ళీ బాగా ఫాం లో కి వచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్.. కోలీవుడ్ లోనూ వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న క్రేజ్ లో ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్న లకి గట్టి పోటీ ఇవ్వడం పక్కా అంటున్నారు.
ఇక రీసెంట్ గా క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాని కంప్లీట్ చేసిన రకుల్ ప్రస్తుతం నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో రూపొందుతున్న చెక్ అన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని అంటున్నారు. ఇక రకుల్ ఈ సినిమాలో లాయర్ గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇక నితిన్ సినిమా, వైష్ణవ్ తేజ్ సినిమాలతో రకుల్ కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కడం గ్యారెంటీ అన్న నమ్మకం తో ఉంది.
ఇక ఇప్పటికే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో నటించిన దే దే ప్యార్ దే సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా మళ్ళీ అజయ్ దేవగన్ తో నటించడానికి రీసెంట్ గా సైన్ చేసింది. కోలీవుడ్ లో అయలాన్ సినిమాతో పాటు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా టాలీవుడ్ లో యంగ్ హీరో సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న మరో సినిమాలో నాగ శౌర్య నటించబోతుండగా ఈ సినిమాకి ‘శ్రీకృష్ణ సత్యభామ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు సమాచారం.
కాగా రీసెంట్ గా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ డేటింగ్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టింది. గత కొన్ని రోజులుగా రకుల్ ఎవరితోనో డేటింగ్ చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఈ విషయంలో స్పందించిన రకుల్ తాను ఎవరితో డేటింగ్ లో లేనని అంత సమయం తనకి లేదని .. ప్రస్తుతం తన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నట్టు ఆ ప్రాజెక్ట్స్ తో రెండేళ్ళ వరకు బిజీగా ఉంటానని వెల్లడించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!